Andre Russell: తన సూపర్ హిట్టింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టే వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ టీ20 క్రికెట్‌లో తనదైన ఇన్నింగ్స్ లతో మరో కొత్త మైలురాయిని అందుకున్నాడు. లెజెండరీ ప్లేయర్లకు సాధ్యంకాని రికార్డును సాధించాడు.
ఆండ్రీ రస్సెల్ టీ20 క్రికెట్ లో 9000 పరుగులు మార్కును అందుకున్నాడు. అయితే, ఇందులో చెప్పుకోవాల్సిన విషయం అతను ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 9,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ గా నిలిచాడు.
టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన ఆండ్రీ రస్సెల్
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా ఘనత సాధించాడు. ఆండ్రీ రస్సెల్ కేవలం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
అంతకుముందు టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 9000 పరుగుల మార్కును అందుకున్న రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉంది. మ్యాక్స్ వెల్ 5,915 బంతుల్లో 9000 పరుగుల రికార్డును అందుకున్నాడు. ఇప్పుడు మ్యాక్స్ వెల్ ను ఆండ్రీ రస్సెల్ అధిగమించాడు.
టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 9000 పరుగులు అందుకున్న టాప్-6 ప్లేయర్లు
1. ఆండ్రీ రస్సెల్ (వెస్టిండీస్) - 5321 బంతులు
2. గ్లెన్ మ్యాక్స్ వెల్ (ఆస్ట్రేలియా) - 5915 బంతులు
3. ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా) - 5985 బంతులు
4. కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్) - 5988 బంతులు
5. క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 6007 బంతులు
6. అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్) - 6175 బంతులు
టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆండ్రీ రస్సెల్ 25వ స్థానంలో ఉన్నాడు. 536 మ్యాచ్‌ల్లో 26.79 సగటుతో 169.15 స్ట్రైక్ రేట్‌తో 9004 పరుగులు సాధించాడు. ఇందులో 31 అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. టీ20 క్రికెట్ లో కెరీర్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో వెస్టిండీస్ మాజీ స్టార్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ టాప్ లో ఉన్నాడు. క్రిస్ గేల్ 463 మ్యాచ్‌ల్లో 14,562 పరుగులు చేశాడు.
1. క్రిస్ గేల్ - 14,562 పరుగులు (463 మ్యాచ్ లు)
2. అలెక్స్ హేల్స్ - 13558 పరుగులు (492 మ్యాచ్ లు)
3. కీరన్ పొలార్డ్ - 13537 పరుగులు (695 మ్యాచ్ లు)
4. షోయబ్ మాలిక్ - 13492 పరుగులు (551 మ్యాచ్ లు)
5. డేవిడ్ వార్నర్ - 12909 పరుగులు (398 మ్యాచ్ లు)
andre russell
బ్యాట్ తోనే కాదు బంతితో కూడా అదరగొడుతున్న ఆండ్రీ రస్సెల్
దుబాయ్ లో జరిగిన ILT20 27వ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ 9000 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ టోర్నీలో అతను అబుదాబి నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టడంతో ఈ ఘనతను సాధించాడు.
ఆండ్రీ రస్సెల్ టీ20 కెరీర్ గమనిస్తే.. 536 మ్యాచ్‌లు ఆడి, 26.79 సగటుతో 9,004 పరుగులు చేశాడు. ఇక్కడ అతని స్ట్రైక్ రేట్ 169.15 గా ఉంది. తన కెరీర్‌లో 31 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు నమోదు చేశాడు. T20 క్రికెట్‌లో 9,000 పరుగుల మార్కును అధిగమించిన 25వ ఆటగాడు ఆండ్రీ రస్సెల్. బ్యాటింగ్ అదరగొట్టే ఆండ్రీ రస్సెల్ బాల్ తో కూడా దుమ్మురేపుతాడు. అతను టీ20 క్రికెట్‌లో 25.55 సగటు, 8.71 ఎకానమీ రేటుతో 466 వికెట్లు పడగొట్టి తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో సత్తా చాటాడు.