ఆసియా కప్ టోర్నీకి అర్జున్ టెండూల్కర్! సచిన్ వారసుడి కోసం స్వయంగా రంగంలోకి దిగిన బీసీసీఐ...

Published : Jun 15, 2023, 12:52 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరంగ్రేటం చేసిన యంగ్ ప్లేయర్లలో అర్జున్ టెండూల్కర్ ఒకడు. ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన అర్జున్ టెండూల్కర్, 4 మ్యాచులు ఆడి 3 వికెట్లు తీశాడు...

PREV
17
ఆసియా కప్ టోర్నీకి అర్జున్ టెండూల్కర్! సచిన్ వారసుడి కోసం స్వయంగా రంగంలోకి దిగిన బీసీసీఐ...
Image credit: PTI

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 31 పరుగులు సమర్పించిన అర్జున్ టెండూల్కర్, ఆ తర్వాత టీమ్‌కి దూరమయ్యాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో పెద్దగా మెప్పించలేకపోయిన అర్జున్, బీసీసీఐని మాత్రం పూర్తిగా మెప్పించాడట..

27
Arjun Tendulkar

సచిన్ టెండూల్కర్ కొడుకుని గాడిలో పెట్టేందుకు స్వయంగా బీసీసీఐ ముందుకు వచ్చింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో క్యాంప్‌లో పాల్గొనాల్సిందిగా అర్జున్ టెండూల్కర్‌కి పిలుపు నిచ్చింది బీసీసీఐ..

37
Image credit: PTI

అర్జున్ టెండూల్కర్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లో ఆల్‌రౌండర్లుగా సత్తా చాటుతున్న 20 మంది కుర్రాళ్లకు ఎన్‌సీఏకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌సీఏలో క్యాంపులో చేరాల్సిందిగా పిలుపు అందుకున్న వారిలో ఛేతన్ సకారియా కూడా ఉన్నాడు.
 

47

‘వచ్చే ఏడాది ఎమర్జింగ్ ఆసియా కప్ (అండర్ 23) జరగబోతోంది. దానికి సమర్థులైన కుర్రాళ్లను వెతికే పనిలో బీసీసీఐ బిజీగా ఉంది. ముఖ్యంగా ఆల్‌రౌండర్లుగా సత్తా చాటుతున్న కుర్రాళ్లు, వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మూడు ఫార్మాట్లలో రాటు తేలబోతున్నారు...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి తెలియచేసినట్టు పీటీఐ రాసుకొచ్చింది..

57

అర్జున్ టెండూల్కర్, ఛేతన్ సకారియాతో పాటు ఐపీఎల్‌ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన అభిషేక్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన హర్షిత్ రాణా కూడా ఈ క్యాంపులో చేరబోతున్నారు..

67

రంజీ ట్రోఫీలో గోవా తరుపున సెంచరీ చేసిన అర్జున్ టెండూల్కర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా. అలాగే ఛేతన్ సకారియా కూడా లెఫ్ట్ ఆర్మ్ యంగ్ పేసర్... 

77

జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తర్వాత సరైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేకపోవడం టీమిండియా తెగ ఇబ్బంది పెడుతోంది. అందుకే ఈ విషయంపై బీసీసీఐ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది..
 

click me!

Recommended Stories