కాగా.. ఐపీఎల్ తో పాటు తన కెప్టెన్సీ గురించి కూడా గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు కెప్టెన్సీ అనేది మైదానంలో ముందుండి నడిపించడం. సారథ్యం అనేది జట్టును బలంగా తీర్చిదిద్దడం. ఆ క్రమంలో నేను అజారుద్దీన్, సచిన్, ద్రావిడ్ లతో కలిసి పనిచేసినప్పుడు వారితో పోటీ పడలేదు. వాళ్లతో కలిసి బాధ్యతలను పంచుకున్నా..’ అని తెలిపాడు.