ఎవ్వరికైనా ఐపీఎల్‌ని కొట్టే దమ్ము ఉందా! ఎక్కడైనా మేమే తోపు... ఐపీఎల్ ఛైర్మెన్ అరుణ్ ధుమాల్ కామెంట్స్...

Published : Jun 02, 2023, 06:13 PM ISTUpdated : Jun 02, 2023, 07:05 PM IST

ఒకప్పుడు ఐసీసీ టోర్నీల గురించి దేశాలు పోటీపడేవి. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఐపీఎల్ వచ్చాక ప్రతీ క్రికెట్ బోర్డు కూడా ఫ్రాంఛైజీ లీగులను తీసుకొచ్చింది. మాది గొప్పంటే మాది గొప్ప అంటూ కొత్త గొడవ మొదలైంది...

PREV
18
ఎవ్వరికైనా ఐపీఎల్‌ని కొట్టే దమ్ము ఉందా! ఎక్కడైనా మేమే తోపు... ఐపీఎల్ ఛైర్మెన్ అరుణ్ ధుమాల్ కామెంట్స్...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో మొదలై 16 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంటే బిగ్ బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాక్ సూపర్ లీగ్, ది హాండ్రెడ్, తాజాగా సౌతాఫ్రికా20... ఇలా క్రికెట్ ఆడే ప్రతీ దేశం కూడా ఓ ఫ్రాంఛైజీ లీగ్‌ని తీసుకొచ్చింది...

28
Image credit: PTI

అయితే మార్కెట్ వాల్యూ, వ్యూయర్‌షిప్, బ్రాండ్ వాల్యూ, టీఆర్పీ, మీడియా రైట్స్ ఇలా ప్రతీ విషయంలో ఐపీఎల్, మిగిలిన అన్ని లీగ్‌లకంటే టాప్‌లో ఉంది. ఐపీఎల్ 2022 సీజన్‌కి పెద్దగా ఆదరణ రాకపోయినా 2023 సీజన్ గత రికార్డులను లేపి కుదేసింది...
 

38

‘ఐపీఎల్‌కి ఎవ్వరూ పోటీగా కనిపించడం లేదు. ఎవ్వరూ మాకు దరిదాపుల్లో కూడా లేరు. టీ20 లీగ్స్ ప్రారంభిస్తున్న ప్రతీ బోర్డుకు ఆల్‌ ది బెస్ట్.. ఐపీఎల్‌కి పోటీ ఇవ్వగలరేమో ప్రయత్నించండి.. అయితే కొడతామని కలలో కూడా అనుకోకండి....

48

ఐపీఎల్‌ది అఖండ విజయం. ఈ ఏడాది అది మరింత పెరిగింది. ప్రతీ మ్యాచ్‌ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది, లాస్ట్ ఓవర్ దాకా నడిచాయి. అభిమానుల నుంచి మేం ఊహించినదాని కంటే ఎక్కువే రెస్పాన్స్ వచ్చింది...
 

58

వ్యూయర్‌షిప్ రికార్డులు కూడా బద్దలయ్యాయి. మా బ్రాడ్‌కాస్టర్లు, డిజిటల్ పార్టనర్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వచ్చే సీజన్‌లో మ్యాచుల సంఖ్య పెంచే ఆలోచన ఉంది. అయితే దానికి ముందు ఫ్రాంఛైజీలను, టీమ్ యజమానులతో మీటింగ్ ఉంటుంది..
 

68

వచ్చే సీజన్‌కి ఇంకా 10 నెలల సమయం ఉంది. అప్పటికి ఏం చేయాలో ప్లాన్ చేస్తాం. ఇప్పటికైతే ఈ సీజన్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాం..

78

ఐసీసీ,  ప్రపంచంలో అన్ని దేశాల్లో క్రికెట్‌కి ఆదరణ తెప్పించాలని ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో బీసీసీఐ సహకారం ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఐపీఎల్ ఛైర్మెన్ అరుణ్ సింగ్ ధుమాల్.. 

88

ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌కి రియల్ టైం 3.2 కోట్లుగా నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. దాదాపు ప్రతీ మ్యాచ్‌కి 1.6 కోట్లకు పైగా రియల్ టైం నమోదైంది... 

click me!

Recommended Stories