Image credit: PTI
ఐపీఎల్ 2023 మినీ వేలంలో బెన్ స్టోక్స్‌ని రూ.16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. సాధారణంగా ఏ ప్లేయర్‌కీ ఇంత భారీ మొత్తం పెట్టని సీఎస్‌కే, బెన్ స్టోక్స్‌పై ఇంతగా ఖర్చు పెట్టడానికి కారణం అతన్ని ఫ్యూచర్ కెప్టెన్‌గా చూడడమే...
ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, వచ్చే సీజన్‌లో ఆడేది లేనిది క్లారిటీగా చెప్పలేదు. 42 ఏళ్ల ధోనీ వచ్చే సీజన్ ఆడినా, ఆ తర్వాతి సీజన్‌లో అయినా కొత్త కెప్టెన్‌ని వెతుక్కోవాల్సిన పరిస్థితి సీఎస్‌కేది...
ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండే రెండు మ్యాచులు ఆడిన బెన్ స్టోక్స్, 15 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒకే ఓవర్ బౌలింగ్ చేసి వికెట్ కూడా తీయలేకపోయాడు. మొత్తంగా సీఎస్‌కే విజయంలో బెన్ స్టోక్స్ ఇచ్చిన సహకారం సున్నా...
MS Dhoni
కొన్నేళ్లుగా గాయాలతో సతమతమవుతున్న బెన్ స్టోక్స్, ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పడం కష్టం. వచ్చే సీజన్‌లో బెన్ స్టోక్స్ ఆడొచ్చు, ఆడకూడదని కూడా నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి అతన్ని ఫ్యూచర్ కెప్టెన్‌గా చూడడంలో అర్థం లేదని భావిస్తోందట చెన్నై సూపర్ కింగ్స్..
MS Dhoni
2022 వరకూ ధోనీ రిటైర్ అయితే జడేజా, చెన్నై సూపర్ కింగ్స్‌కి సారథిగా వ్యవహరిస్తాడని అనుకునేవాళ్లు. అయితే 2022 సీజన్‌లో ఆ ముచ్చట కూడా తీరింది. 2022 సీజన్ ఆరంభానికి ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, జడ్డూ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడం జరిగిపోయాయి...
Image credit: PTI
2022 సీజన్‌లో 8 మ్యాచులకు కెప్టెన్సీ చేసిన జడేజా, రెండే విజయాలు అందుకున్నాడు. దీంతో బలవంతంగా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించింది సీఎస్‌కే. ఈ అనుభవంతో జడేజా మళ్లీ కెప్టెన్సీ జోలికి పోకపోవచ్చు...
అజింకా రహానేకి ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఐదు టెస్టుల్లో నాలుగు విజయాలు అందుకున్న రహానే, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అయితే రహానేకి సీఎస్‌కే కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువే...
Image credit: PTI
ఇక టీమ్‌లో ఉన్న డివాన్ కాన్వే, మొయిన్ ఆలీ, శివమ్ దూబే, దీపక్ చాహార్, తుషార్ దేశ్‌పాండే అండ్ కో... కెప్టెన్ మెటిరీయల్ కూడా కాదు. సీనియర్లతో నిండిన టీమ్‌ని రుతురాజ్ గైక్వాడ్‌కి అప్పగించడమూ కరెక్ట్ కాదు...
Image credit: PTI
దీంతో ధోనీ తప్పుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ముందు అతిపెద్ద ఛాలెంజ్ ఆ ప్లేస్‌ని రిప్లేస్ చేయగల కెప్టెన్‌ని వెతికి పట్టుకోవడమే. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో విరాట్ కోహ్లీకి బాధ్యతలు అప్పగించాడు ధోనీ. మరి సీఎస్‌కే పగ్గాలు ఎవరికి ఇస్తాడో...