ఇంకెన్నాళ్లు ఇలా అవమానిస్తారు! అంత పెద్ద తప్పేం చేశా... డేవిడ్ వార్నర్ అసంతృప్తి...

First Published Jun 2, 2023, 4:38 PM IST

అప్పుడెప్పుడో 2018లో సాండ్ పేపర్ బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కున్న పాపానికి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాడు డేవిడ్ వార్నర్. ఆ నాటకంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు బౌలర్‌పై కూడా వేటు ఎత్తేసిన క్రికెట్ ఆస్ట్రేలియా, డేవిడ్ వార్నర్‌ మీద వేసిన కెప్టెన్సీ నిషేధాన్ని మాత్రం తొలగించడం లేదు..

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో సాండ్ పేపర్ వాడి బాల్ టాంపరింగ్ చేసినందుకు అప్పటి సారథి స్టీవ్ స్మిత్‌, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పైన ఏడాది పాటు నిషేధం విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా...

కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా, వైస్ కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ జీవితంలో కెప్టెన్సీ చేయకుండా లైఫ్ టైం బ్యాన్ వేసింది. 

ఈ సంఘటన తర్వాత నాలుగేళ్లకు స్టీవ్ స్మిత్‌, తిరిగి టెస్టు వైస్ కెప్టెన్‌గా మారి.... ప్యాట్ కమ్మిన్స్ ఆడని మ్యాచుల్లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు..

అయితే డేవిడ్ వార్నర్‌పై విధించిన జీవిత కాల కెప్టెన్సీ బ్యాన్ మాత్రం ఎత్తివేయడానికి మీనమేషాలు లెక్కబెడుతోంది క్రికెట్ ఆస్ట్రేలియా. 9 నెలలుగా తనపై విధించిన కెప్టెన్సీ బ్యాన్ ఎత్తివేయాల్సిందిగా కోరుతునే ఉన్నాడు డేవిడ్ వార్నర్...

Ball-tampering scandal

‘ఇది దారుణం. దీన్ని ఇప్పటికైనా ముగించాలని నేను అనుకుంటున్నా కానీ వాళ్లు మాత్రం సాగతీస్తూనే ఉన్నారు. నాపైన బ్యాన్ ఎందుకు ఎత్తివేయడం లేదో మాత్రం చెప్పడం లేదు...

Image credit: PTI

ఎవ్వరూ బాధ్యత తీసుకోవడం లేదు, ఎవ్వరూ నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం లేదు. అడ్మినిస్టేషన్‌లోనే సరైన లీడర్‌షిప్ లేదని అనిపిస్తోంది. ఇది నాకు చిరాకు తెప్పిస్తోంది. ఇంకెన్నాళ్లు ఇలా అవమానిస్తారు.. 

David Warner

వాళ్లకేం కావాలో నేరుగా చెప్పాలి. టెస్టు మ్యాచులు జరుగుతున్నప్పుడు, నేను బిజీగా మ్యాచులు ఆడుతున్నప్పుడు లాయర్లు ఫోన్ చేస్తారు. ఏదేదో చెబుతారు. నా ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తారు.

Pat Cummins with David Warner

9 నెలల క్రితం బ్యాన్ ఎత్తివేయాలని కోరా. ఇప్పటికీ అది ముందుకు కదలకపోవడం చాలా నిరుత్సాహపరుస్తోంది..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్..

click me!