ధోనీ, ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడతాడు! త్వరలో హీరోగా ఎంట్రీ... ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన సాక్షి ధోనీ...

Chinthakindhi Ramu | Published : Jul 28, 2023 5:26 PM
Google News Follow Us

మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడతాడా? లేదా? ఇప్పుడు మాహీ ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న ప్రశ్న ఇదే. వచ్చే సీజన్‌లో ఆడతాడా? లేదా? అనే విషయమై ధోనీ ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు...

18
ధోనీ, ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడతాడు! త్వరలో హీరోగా ఎంట్రీ...  ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన సాక్షి ధోనీ...

మోకాలి గాయంతో బాధపడుతూనే ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడాడు మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీ, ఆఖరి ఐపీఎల్ సీజన్ అని 2023 సీజన్‌ని ప్రమోట్ చేసింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్...
 

28

ఈ కారణంగా మాహీ ఫేర్‌వెల్ సీజన్‌ని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, 11 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కి వచ్చి 34.67 సగటుతో 104 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ధోనీ స్ట్రైయిక్ రేటు 185.71గా ఉంది.. 

38

ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, తన సొంత ప్రొడక్షన్‌లో నిర్మించిన ‘ఎల్‌జీఎం’ (Lets Get Married) చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు...
 

Related Articles

48

ఈ సినిమా, జూలై 28న విడుదలైంది. చెన్నైలో ఓ థియేటర్‌లో సినిమా యూనిట్‌తో కలిసి మూవీ చూసిన మాహీ భార్య సాక్షి సింగ్, ధోనీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది...
 

58

‘ధోనీకి తమిళ్‌ ఫ్యాన్స్ అంటే ఎంతో అభిమానం. తమిళనాడుని తన సొంత రాష్ట్రంగా భావిస్తాడు. ప్రస్తుతం ధోనీ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడతాడు...
 

68

మహీకి నటన కొత్తేమీ కాదు. ఇప్పటికే అనేక యాడ్స్‌లో నటించాడు. ఆయనకి కెమెరా ఫియర్ లేదు. మంచి స్క్రిప్ట్ దొరికితే హీరోగా నటించడానికి కూడా మాహీ రెఢీగా ఉన్నాడు...’ అంటూ కామెంట్ చేసింది సాక్షి సింగ్ ధోనీ...

78

స్వయంగా సాక్షి సింగ్ ప్రకటించడంతో మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2024 సీజన్ ఆడడం ఖాయమే. ఎందుకంటే ధోనీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని డిసైడ్ చేసేది సాక్షియే. ఐపీఎల్ 2020, 2022 సీజన్‌లో సీఎస్‌కే ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్నప్పుడు మొదట స్పందించింది కూడా సాక్షియే..

88

సాక్షి సింగ్ నిర్మించిన ‘ఎల్‌జీఎం’ మూవీకి యావరేజ్ రేటింగ్ దక్కింది. హరీశ్ కళ్యాణ్, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన, ‘ఎల్‌జీఎం’లో నదియా ముఖ్య పాత్రలో నటించింది. 

Read more Photos on
Recommended Photos