ఆడిలైడ్ ఓటమి తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చాం, ఈసారి కూడా... మూడో టెస్టు ఓటమి తర్వాత కోహ్లీ కామెంట్స్...

First Published | Aug 28, 2021, 8:42 PM IST

లీడ్స్ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడినా, తర్వాతి టెస్టులో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఆడిలైడ్‌ ఓటమి తర్వాత మెల్‌బోర్న్ టెస్టులో గెలిచినట్టు, లీడ్స్‌లో ఓడినా ఓవల్‌లో జరిగే నాలుగో టెస్టులో కమ్‌బ్యాక్ ఇస్తామని అన్నాడు కోహ్లీ...

టీమిండియా చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం గత ఏడాది ఆడిలైడ్ పరాభవం. ఈ డే- నైట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై ఆధిక్యం సంపాదించి, డామినేట్ చేస్తున్నట్టు కనిపించిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకి కుప్పకూలి, ఘోర ఓటమి మూట కట్టుకుంది...

అయితే ఆ తర్వాత జట్టులో చాలా మార్పులు జరిగి, మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం అందుకుంది టీమిండియా... అదే ఊపులో సిరీస్ కూడా గెలిచి, సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది...


ఇంగ్లాండ్ టూర్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడినా, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో శుభారంభం చేసింది భారత జట్టు. తొలి టెస్టులో వర్షం కారణంగా విజయాన్ని పొందలేకపోయిన టీమిండియా, లార్డ్స్‌లో పూర్తి ఆధిపత్యం చూపించి అద్భుతమైన విజయం పొందింది...

అయితే ఆ ఉత్సాహం తర్వాతి మ్యాచ్‌కే నీరుగారిపోయింది. లీడ్స్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా, ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓడి, ఘోర ఓటమిని మూటకట్టుకుంది...

‘తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులు కూడా చేయనప్పుడు, ఆ ఒత్తిడి ప్రతీ ప్లేయర్‌పై పడుతుంది. మా విషయంలో కూడా జరిగింది అదే. ప్రత్యర్థి భారీ స్కోరు చేయడం కూడా మా విజయావకాశాలను దెబ్బ తీసింది...

మూడో రోజు నిలబడి ఫైట్ చేయగలిగాం. అయితే నాలుగో రోజు ఆరంభంలో మాపై ఒత్తిడి పెంచి, రిజల్ట్ రాబట్టడంలో ఇంగ్లాండ్ బౌలర్లు సక్సెస్ అయ్యారు... 

ఇండియానే కాదు, ప్రతీదేశం కూడా తనది కాని రోజున ఇలాగే కుప్పకూలుతుంది. పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంటుందని అనుకున్నాం, కానీ ఇంగ్లాండ్ బౌలర్లు చూపించిన క్రమశిక్షణా, మేం చేసిన తప్పులు వారికి బాగా కలిసి వచ్చాయి...

ఆస్ట్రేలియాలో 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత కూడా మేం కమ్‌బ్యాక్ ఇచ్చి, సిరీస్ గెలవగలిగాం. ఈసారి కూడా అలాగే చేయగలమని నమ్ముతున్నాం... 

తర్వాతి మ్యాచ్‌లో మరో స్పిన్నర్‌ని ఆడించాలా? వద్దా? అనేది పిచ్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఫాస్ట్ బౌలర్లపై ఒత్తిడి తగ్గించేందుకు రొటేషన్ పాలసీని పాటించాలని అనుకుంటున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

Latest Videos

click me!