షకీబ్ అల్ హసన్ ఆల్‌టైం బెస్ట్ వన్డే ఎలెవన్ టీమ్‌ ఇదే... టీమిండియా నుంచి ఆ ముగ్గురూ...

First Published | Aug 28, 2021, 7:44 PM IST

బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, ఆల్‌ టైం బెస్ట్ వన్డే ఎలెవన్ టీమ్‌ను ప్రకటించాడు. బంగ్లా ఆల్‌రౌండర్ ప్రకటించిన టీమ్‌లో అత్యధికంగా టీమిండియా నుంచి ముగ్గురు ప్లేయర్లు, పాకిస్తాన్, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, శ్రీలంక, సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్ నుంచి ఒక్కో ప్లేయర్ ఉండడం విశేషం...

సచిన్ టెండూల్కర్: వన్డేల్లో అత్యధికంగా 49 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్‌ని తన టీమ్‌కి ఓపెనర్‌గా ఎంచుకున్నాడు బంగ్లా స్టార్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్.

సయ్యద్ అన్వర్: వన్డేల్లో 20 సెంచరీలు చేసిన పాక్ మాజీ ఓపెనర్ సయ్యద్ అన్వర్‌కి షకీబ్ జట్టులో మరో ఓపెనర్‌గా చోటు దక్కింది...


క్రిస్ గేల్: వెస్టిండీస్ బ్యాటింగ్ వీరుడు, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌ గేల్‌కి 301 వన్డేల్లో 25 సెంచరీలు ఉన్నాయి. గేల్‌కి షకీబ్ అల్ హసన్ జట్టులో వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ప్లేస్ దక్కింది.. 

విరాట్ కోహ్లీ: భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీకి 254 వన్డేల్లో 43 సెంచరీలు, 12 వేలకు పైగా పరుగులు ఉన్నాయి. కోహ్లీకి టూ డౌన్ ప్లేయర్‌గా చోటు ఇచ్చాడు షకీబ్...

జాక్వస్ కలీస్: సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వస్ కలీస్‌కి 328 వన్డేల్లో 17 సెంచరీలతో పాటు 273 వికెట్లు కూడా ఉన్నాయి. కలీస్‌ని ఐదో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు షకీబ్.

మహేంద్ర సింగ్ ధోనీ: భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని తన టీమ్‌కి వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా ఎంచుకున్నాడు షకీబ్ అల్ హసన్...

షకీబ్ అల్ హసన్: తన టీమ్‌లో తనకి కూడా స్పిన్ ఆల్‌రౌండర్‌గా చోటు తనకి కూడా చోటు ఇచ్చుకున్నాడు షకీబ్. షకీబ్ అల్ హసన్‌కి 215 వన్డేల్లో 6,600 పరుగులు, 277 వికెట్లు ఉన్నాయి.

ముత్తయ్య మురళీధరన్: శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కి తన టీమ్‌లో స్పిన్నర్‌గా చోటు ఇచ్చాడు షకీబ్ అల్ హసన్..

షేన్ వార్న్: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌కి తన టీమ్‌లో మూడో స్పిన్నర్‌గా ఎంచుకున్నాడు షకీబ్ అల్ హసన్. షకీబ్ టీమ్‌లో ఏకంగా నలుగురు స్పిన్నర్లు ఉండడం విశేషం.

గ్లెన్ మెక్‌గ్రాత్: ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను తన ఆల్‌టైం బెస్ట్ టీమ్‌లో ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఎంచుకున్నాడు. 

వసీం అక్రమ్: పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్‌కి బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ జట్టులో ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా చోటు దక్కింది...

షకీబ్ అల్ హసన్ ఆల్‌టైం బెస్ట్ వన్డే టీమ్: సచిన్ టెండూల్కర్, సయ్యద్ అన్వర్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, జాక్వస్ కలీస్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్

Latest Videos

click me!