మీ భద్రతకు హామీ మాది, అప్పటిదాకా ఐపీఎల్ పూర్తికాదు... ఫారిన్ ప్లేయర్లకు బీసీసీఐ భరోసా...

First Published Apr 27, 2021, 5:19 PM IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా... ఎంతో ఉల్లాసంగా, అభిమానుల అరుపులు, కేరింతల నడుమ జరగాల్సిన ఐపీఎల్ కాస్తా... భయం, అసహనం, ఆందోళనల మధ్య జరుగుతోంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొంటున్న ఫారిన్ ప్లేయర్లు, కరోనా భయంతో ఒక్కొక్కరుగా ఇంటిదారి పడుతున్నారు.

దేశంలో కరోనా బీభత్సం కారణంగా హజల్‌వుడ్ లాంటి ప్లేయర్లు ఇక్కడికి రావడానికే ఇష్టపడకపోగా లియామ్ లివింగ్‌స్టోన్, ఆండ్రూ టై, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా... ఇప్పటికే స్వదేశానికి పయనమయ్యారు. వీరితో పాటు కొందరు ఫారిన్ కామెంటేటర్లు కూడా స్వదేశానికి వెళ్లిపోయారు.
undefined
రెండు రోజుల క్రితం స్వదేశానికి వెళ్లాలని బయలుదేరిన ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్... ముంబై ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోగా... వారిని క్షేమంగా స్వదేశానికి పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా కారణంగా భయాందోళనలకు గురవుతున్న ఫారిన్ ప్లేయర్లకు భరోసా ఇచ్చింది బీసీసీఐ...
undefined
‘ఐపీఎల్‌లో పాల్గొంటున్న ప్లేయర్లు, టోర్నీ ముగిసిన తర్వాత స్వదేశానికి ఎలా వెళ్లాలనే ఆందోళనకు గురవుతున్నట్టు మాకు అర్థమైంది. ఆస్ట్రేలియా వంటి దేశాలు, భారత్‌ నుంచి వచ్చే విమాన రాకపోకలపై నిషేధం విధించడమే దీనికి కారణం...
undefined
అయితే మీరు, ఇంటికి ఎలా వెళ్లాలనేదానిపై చింతించాల్సిన అవసరమే లేదు. మీ భద్రతకు హామీ మాది, టోర్నీ ముగిసిన తర్వాత క్షేమంగా మీ ఇంటికి చేరుస్తాం... ఇందులో ఎలాంటి ఆందోళనా అక్కర్లేదు...
undefined
దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నాం. ఇక్కడికి ఎలా వచ్చారో, మీ ఇంటికి అలా చేరుస్తాం... అప్పుడు టోర్నీ విజయవంతంగా ముగిసినట్టు అర్థం. విపత్కర పరిస్థితుల్లో కొన్ని కోట్ల మందికి వినోదాన్ని అందిస్తోంది ఐపీఎల్...
undefined
క్రికెటర్ల ఆట కారణంగా ఎందరో కరోనాను విజయవంతంగా జయించేందుకు కావాల్సిన ఎనర్జీని పొందుతున్నారు. మీ భద్రతను చూసుకోవాల్సిన భాద్యత మాది... ’ అంటూ తెలిపాడు ఐపీఎల్ సీఓవో హేమాంగ్ అమిన్.
undefined
click me!