మైసూర్‌లో ధోనీ మైనపు బొమ్మ... ఆదిపురుష్‌కి వీఎఫ్‌క్స్ చేసినోడే, ఈ బొమ్మ చేశాడా ఏంది...

First Published Oct 8, 2022, 1:47 PM IST

టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న మాహీకి మైసూర్‌లోని వ్యాక్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం రూపొందించారు మ్యూజియం నిర్వాహకులు. తాజాగా ఓ అభిమాని, ఈ మాహీ మైనపు బొమ్మ దగ్గర ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కొద్దిసేపటికే ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది... అయితే ఈ బొమ్మ చూడడానికి మాహీలా ఉండకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది...

మాహేంద్ర సింగ్ ధోనీ మైనపు బొమ్మ చేసిన వాడు, మాహీతో పాటు రణ్‌బీర్ కపూర్‌కి కూడా అభిమాని అయ్యుంటాడు. అందుకే ఒకే బొమ్మలో ఇద్దరినీ కలిపి దింపేశాడు. ఇది మాహీ స్టాచ్యూలా లేదు, మహిబీర్ స్టాచ్యూలా ఉంది... అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు...

కొందరు ఇది మహేంద్ర సింగ్ ధోనీ బొమ్మలా లేదని, ఓ వైపు నుంచి చూస్తుంటే టాలీవుడ్ హీరో మహేష్ బాబులా, మరో వైపు నుంచి పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో అది హైలైట్ అంటున్నారు అభిమానులు... 

Latest Videos


‘ఆదిపురుష్’ సినిమాకి వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేసిన వాడే, మహేంద్ర సింగ్ ధోనీ వ్యాక్స్ స్టాచ్యూని తయారుచేసి ఉంటాడు... ఆ పనితనం ఇట్టే కనిపిస్తోంది...’ అంటూ మరో అభిమాని వ్యంగ్యంగా పోస్టు చేశాడు. మాహీని గౌరవించాలనే ఉద్దేశంతో వ్యాక్స్ స్టాచ్యూ చేశారా? లేక అవమానించే ఉద్దేశంతోనే ఇలా తయారుచేశారా? అంటూ ధోనీ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు..

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఫేస్‌బుక్‌ లైవ్‌లోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ... ఓరియో బిస్కెట్ ప్రమోషన్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ‘2011లో ఓరియో బిస్కెట్ ఇండియాకి వచ్చింది, టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది...’ అంటూ మాహీ చేసిన కామెంట్లు కూడా ట్రోలింగ్‌కి కారణమయ్యాయి...

Image credit: MS DhoniFacebook

2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే కొత్త సారథిగా బాధ్యతలు తీసుకున్న జడేజా, సీజన్ మధ్యలోనే తప్పుకోవడంతో మళ్లీ కెప్టెన్‌గా నియమించబడ్డాడు మాహీ...

2023 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మహేంద్ర సింగ్ ధోనీయే నడిపించబోతున్నాడని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది సీఎస్‌కే మేనేజ్‌మెంట్. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అభిమానుల మధ్య మ్యాచ్ ఆడిన తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని స్వయంగా ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ... 

click me!