టీమిండియా ఫ్యూచర్ అతడే.. చెన్నై ఓపెనర్‌పై వసీం అక్రమ్ ప్రశంసలు

Published : Jun 02, 2023, 02:44 PM IST

IPL 2023: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్  ఐదో టైటిల్ సాధించడంలో ఆ జట్టు బ్యాటర్లది కీలక పాత్ర.  ముఖ్యంగా సీఎస్కే ఓపెనర్లు ఆ జట్టుకు ఘనమైన ఆరంభాలు అందించారు. 

PREV
16
టీమిండియా ఫ్యూచర్ అతడే.. చెన్నై ఓపెనర్‌పై వసీం అక్రమ్ ప్రశంసలు

ఐపీఎల్ - 16 లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదో టైటిల్ గెలవడంతో ఆ జట్టు సారథి, కీలక ఆటగాళ్లపై  ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సీఎస్కే బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచిన  ఓపెనర్లు డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ లపై క్రికెట్ విశ్లేషకులు  ప్రశంసలు కురిపిస్తున్నారు.

26

తాజాగా ఇదే విషయమై పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం  అక్రమ్ కూడా స్పందించాడు.  సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ పై అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై టీమ్  తో పాటు రాబోయే రోజుల్లో టీమిండియాకూ  అతడే ఫ్యూచర్ స్టార్ అని కొనియాడాడు.  

36
Image credit: PTI

అక్రమ్ మాట్లాడుతూ... ‘ఈ సీజన్ లో గైక్వాడ్ అత్యంత ఒత్తిడిలో కూడా అద్భుతంగా ఆడాడు.  అంతేగాక అతడు ఫిజికల్ గా కూడా చాలా ఫిట్ గా ఉన్నాడు. బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ ఈ యువ ఆటగాడు  తన మార్కును చూపిస్తున్నాడు. 

46
Image credit: Wikimedia Commons

రాబోయే రోజుల్లో గైక్వాడ్  టీమిండియాకు స్టార్ ఆటగాడిగా ఎదుగుతాడు.  భారత జట్టుతో పాటు చెన్నైకి అతడు కీలక ఆటగాడిగా మారుతాడు..’అని స్పోర్ట్స్ కీడాతో మాట్లాడుతూ అన్నాడు. 

56
Image credit: PTI

ఈ సీజన్ లో  రుతురాజ్..  16 మ్యాచ్ లలో 15 ఇన్నింగ్స్ లో  బ్యాటింగ్ కు వచ్చి 42.14 సగటుతో  590  పరుగులు చేశాడు.   డెవాన్ కాన్వే తో కలిసి చెన్నై టీమ్ కు మంచి ఆరంభాలు ఇచ్చాడు. ఇద్దరూ కలిసి చెన్నైకి సుమారు వెయ్యికిపైగా పరుగులు చేశారు. 

66

ఇటీవలే గైక్వాడ్ ఐపీఎల్ తో పాటు దేశవాళీలో రాణించడంతో  బీసీసీఐ అతడిని  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్  కు ఎంపిక చేసింది. స్టాండ్ బై  ప్లేయర్ గా అతడిని  ఎంపిక చేసినా  పెళ్లి కారణంగా ఈ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు గైక్వాడ్.

click me!