ఓవల్‌లో చాలా కష్టమే! ఫైనల్ వేదికలో కోహ్లీ, పూజారా, రహానేలకు చెత్త రికార్డు... అదే జరిగితే...

First Published Jun 2, 2023, 1:48 PM IST


ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వరుసగా రెండోసారి బరిలో దిగుతోంది భారత జట్టు. గత సీజన్ ఫైనల్‌లో టీమిండియాని ఓడించి 20 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ నెగ్గిన న్యూజిలాండ్,ఈసారి పాయింట్ల పట్టికలో టాప్ 5లో కూడా నిలవలేకపోయింది..
 

గత డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా, 2021-23 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సీజన్‌లో కూడా వరుస విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాని 2-1 తేడాతో ఓడించిన భారత జట్టు, ఫైనల్‌ మ్యాచ్‌లో మళ్లీ ఆసీస్‌తోనే తలబడుతోంది..

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌కి లండన్‌లో కెన్నింగ్టన్ ఓవల్‌ వేదిక ఇవ్వనుంది. ఈ మైదానంలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి ప్రారంభమయ్యే ఫైనల్‌కి జూన్ 12ని రిజర్వు డేగా కూడా కేటాయించింది ఐసీసీ...  

వర్షం కారణంగా లేదా మరే కారణం చేతైనా ఆటకి అంతరాయం కలిగి ఐదు రోజుల్లో ఫలితం తేలకపోతే ఆరో రోజు రిజర్వు డేన కూడా ఆట సాగుతుంది. టీమిండియాకి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019లో, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021 టోర్నీల్లో రిజర్వు డే రిజల్ట్ కలిసి రాలేదు..

అదీకాకుండా కెన్నింగ్టన్ ఓవల్‌లో భారత ఆటగాళ్లకు ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 4 టెస్టులు ఆడి 272 పరుగులు చేస్తే, రాహుల్ ద్రావిడ్ 3 టెస్టుల్లో 110.75 సగటుతో 443 పరుగులు చేసి అదరగొట్టాడు...

Image credit: PTI

ప్రస్తుత జట్టులో విరాట్ కోహ్లీ, ఈ స్టేడియంలో 3 మ్యాచులు ఆడి 28.16 సగటుతో 169 పరుగులు చేశాడు. ఇక్కడ కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 50 పరుగులే... ఈ హాఫ్ సెంచరీ కూడా 2021 ఇంగ్లాండ్ పర్యటనలో వచ్చినదే.. 

ఛతేశ్వర్ పూజారా కూడా ఈ స్టేడియంలో 3 మ్యాచులు ఆడాడు. ఇక్కడ విరాట్ కోహ్లీ కంటే దారుణంగా 19.50 సగటుతో 3 మ్యాచుల్లో 117 పరుగులే చేశాడు పూజారా. ఈ స్టేడియంలో పూజారా అత్యధిక స్కోరు 61 పరుగులు...
 

భారత మాజీ వైస్ కెప్టెన్ అజింకా రహానే కూడా ఇక్కడ 3 టెస్టులు ఆడాడు. మూడు టెస్టుల్లో కలిపి రహానే చేసిన పరుగులు 55 మాత్రమే. ఈ స్టేడియంలో రహానే యావరేజ్ 9.16 మాత్రమే... టీమిండియా బ్యాటింగ్‌కి వెన్నెముకలాంటి ఈ ముగ్గురు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు కెన్నింగ్టన్ ఓవల్‌లో చెత్త రికార్డు ఉండడం టీమిండియాని భయపెట్టే విషయం..

Image credit: PTI

రవీంద్ర జడేజా ఇక్కడ 2 మ్యాచులు ఆడి 42 సగటుతో 126 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 11 వికెట్లు తీశాడు. జడ్డూ బీభత్సమైన ఫామ్‌లో ఉండడం కూడా టీమిండియాకి కలిసొచ్చే విషయం...

రిషబ్ పంత్‌కి ఇక్కడ 44.5 సగటు ఉంటే, కెఎల్ రాహుల్‌కి 62.25 సగటు ఉంది. ఈ ఇద్దరూ ఈ స్టేడియంలో సెంచరీలు కూడా చేసుకున్నారు. అయితే గాయం కారణంగా రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ టీమ్‌కి దూరం కావడం భారత జట్టుకి ఇబ్బందిపెట్టే విషయం..
 

Image credit: PTI

రోహిత్ శర్మ ఇక్కడ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. 2021 ఇంగ్లాండ్ పర్యటనలో ఇక్కడ జరిగిన నాలుగో టెస్టులో 127 పరుగులు చేసిన రోహిత్ శర్మ, విదేశాల్లో మొట్టమొదటి టెస్టు సెంచరీ అందుకున్నాడు..  రోహిత్ శర్మకు తోడు పీక్ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ నిలబడితే మిడిల్ ఆర్డర్ నుంచి ఆటోమేటిక్‌గా పరుగులు రావడం గ్యారెంటీ..

click me!