భయాన్ని గ్రౌండ్ బయటపెట్టి ఆడండి... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాకి మాథ్యూ హేడెన్ సలహా..

Chinthakindhi Ramu | Published : Jun 2, 2023 12:16 PM
Google News Follow Us

2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది టీమిండియా. దాదాపు పదేళ్లుగా భారత జట్టు ఐసీసీ టైటిల్ ఆశలు నెరవేరడం లేదు... ముగ్గురు కెప్టెన్లు మారినా, అరడజనుకి పైగా ఐసీసీ టోర్నీలు ఆడినా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది భారత జట్టు..

18
భయాన్ని గ్రౌండ్ బయటపెట్టి ఆడండి...  టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాకి మాథ్యూ హేడెన్ సలహా..

భారత జట్టుకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌, 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఓడింది టీమిండియా...

28

ఆ తర్వాత ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియాకి పరాభవమే మిగిలింది..
 

38

ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, టీమిండియాకి ఐసీసీ టైటిల్ అందిస్తాడని అనుకుంటే... అతని సారథ్యంలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్ నుంచే ఇంటిదారి పట్టింది భారత జట్టు. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఆడనుంది..
 

Related Articles

48

‘టీమిండియాలో స్కిల్ ఉన్న ఆటగాళ్లు పుషల్కంగా ఉన్నారు. అయితే భారత జట్టు అసలు సమస్య మైండ్ సెట్ మాత్రమే.. భారత్‌లో క్రికెట్‌ కేవలం ఓ ఆట మాత్రమే కాదు, చాలామంది జీవితం కూడా. జనాల డీఎన్‌ఏలో క్రికెట్ ఉంటుంది...

58
WTC Final

అందుకే టీమిండియా ఐసీసీ టోర్నీల్లోకి వెళ్లేసరికి కొన్ని కోట్ల మంది అంచనాలను మోయాల్సి వస్తోంది. ఇది వారిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తోంది. టీమిండియాకి నేను ఇచ్చే సలహా ఒక్కటే... ఆ భయాన్ని గ్రౌండ్ బయటపెట్టి ఆడండి...

68

టెస్టు ఛాంపియన్‌షిప్, టెస్టు క్రికెట్‌ని బతికించడానికి పెట్టిన టోర్నీ. క్రికెట్‌లో రెండు దిగ్గజ దేశాలు ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్‌కి వెళ్లాయి. ఓవల్‌లో అటు ఇండియాకి, ఇటు ఆస్ట్రేలియాకి ఇద్దరికీ కలిసి వచ్చే వాతావరణం ఉంటుంది.

78

ఇంగ్లాండ్‌లో పిచ్‌లు బౌన్సర్లకు చక్కగా ఉపయోగపడతాయి. స్పిన్నర్లకు పెద్దగా మద్ధతు దక్కడు. అయితే ఈ స్టేడియంలో ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లకు కూడా బాగా వర్కవుట్ అవుతుంది. 

88
Image credit: PTI

కాబట్టి ఫియర్‌లెస్ క్రికెట్ ఆడితే ఇండియా గెలవడం పెద్ద కష్టమేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్.. 
 

Recommended Photos