ఇషాంత్, సిరాజ్ ఓ నాలుగు బంతులు ఆపి ఉంటే... వాషింగ్టన్ సుందర్ తండ్రి కామెంట్...

First Published Mar 7, 2021, 11:49 AM IST

ఆస్ట్రేలియాతో జరిగినా నాలుగో టెస్టు... ఆసీస్‌కు 32 ఏళ్లుగా ఓటమి లేని గబ్బాలో మ్యాచ్... అయినా యంగ్ టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్, ఆల్‌రౌండ్ షో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసి అవుటైన వాషింగ్టన్ సుందర్, రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

వాషింగ్టన్ సుందర్ చేసిన 62 పరుగులపై ఆయన తండ్రి అభిప్రాయం అడిగినప్పుడు... ‘సెంచరీ చేసి బాగుండేదని’ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. పి. సుందర్ చేసిన ఈ కామెంట్‌పై సెహ్వాగ్ ‘మీ పెద్దొళ్లున్నారే...’ అంటూ పోస్టు చేయడం అప్పట్లో తెగ వైరల్ అయ్యింది...
undefined
ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు వాషింగ్టన్ సుందర్. తనకు సహకరించే నాన్‌స్టైయికర్ లేకపోవడంతో మొట్టమొదటి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు సుందర్...
undefined
సుందర్ 96 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన తర్వాత స్పందించిన మాజీ క్రికెటర్ వసీం జాఫర్... అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, సుందర్ తండ్రికి దొరికితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడని ఫన్నీగా పోస్టు చేశాడు. తాజాగా పి. సుందర్ కూడా ఈ విధంగానే స్పందించాడు...
undefined
‘నా కొడుకులో చాలా మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నాడు. క్లిష్ట సమయాల్లో మంచి ఇన్నింగ్స్ ఆడి, టీమిండియా విజయంలో సాయం పడడం చాలా గర్వంగా ఉంది...
undefined
టీమిండియా ఎప్పుడు కష్టాల్లో ఉన్నా సుందర్ ఇలాగే ఆడతాడు. ఆస్ట్రేలియాలో ఆడిన ఆఖరి టెస్టులోనే ఇది రుజువైంది... 90 పరుగులు దాటిన తర్వాత ఈసారి సెంచరీ చేయడం పక్కా అని అనుకున్నా...
undefined
కానీ అక్షర్ పటేల్ అవుటైన తర్వాత ఇషాంత్ శర్మ, సిరాజ్ డకౌట్ అయ్యారు. ఈ ఇద్దరూ ఒక్కరైనా ఓ నాలుగు బంతులు నిలుపుకొని ఉంటే బాగుండేది...
undefined
సుందర్ సెంచరీ చేయలేకపోయినా, టీమిండియా విజయం సాధించడంతో ఆ బాధను మరిచిపోయాను...’ అంటూ కామెంట్ చేశాడు వాషింగ్టన్ సుందర్ తండ్రి పి. సుందర్.
undefined
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు వాషింగ్టన్ సుందర్. 138 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి కారణంగా ఈ ఇన్నింగ్స్‌కి తగిన గుర్తింపు రాలేదు...
undefined
click me!