అవకాశం వస్తే టెస్టుల్లో ఓపెనింగ్ చేస్తా... మనసులో మాట బయటపెట్టిన వాషింగ్టన్ సుందర్...

First Published Jan 25, 2021, 11:24 AM IST

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన యంగ్ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్... ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్‌తో రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి, భారత జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

21 ఏళ్ల వాషింగ్టన్ సుందర్... ఆస్ట్రేలియాలో ఆరంగ్రేటం టెస్టులోనే మూడు వికెట్లు తీసి, హాఫ్ సెంచరీ చేసిన అతికొద్దిమందిలో ఒకడిగా రికార్డు క్రియేట్ చేశాడు...
undefined
మొదటి ఇన్నింగ్స్‌లో 144 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 62 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్...శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఏడో వికెట్‌కి 123 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే.
undefined
ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ బాదిన ‘నో లుక్ సిక్సర్’ అతని ఇన్నింగ్స్‌లో హైలైట్...
undefined
రెండో ఇన్నింగ్స్‌లో 29 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు సాధించిన వాషింగ్టన్ సుందర్, కీలక సమయంలో ఆరో వికెట్‌కి పంత్‌తో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు.
undefined
‘నాకు బౌలింగ్ కంటే బ్యాటింగ్ ఇష్టం... అవకాశం వస్తే టెస్టుల్లో టీమిండియాకు ఓపెనింగ్ చేయాలని అనుకుంటున్నా... నా ఇన్నింగ్స్‌కి కోచ్ రవిశాస్త్రి సార్ ఇచ్చిన స్ఫూర్తి కారణం...
undefined
రవిశాస్త్రి టీమిండియాకు ఆడేటప్పుడు ఎలాంటి సవాల్‌నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండేవారు... నేను కూడా ఆయనలాగే ఉండాలనుకుంటున్నా...
undefined
కోచ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన కెరీర్‌కి సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటూ ఉంటారు... అవన్నీ నాలో స్ఫూర్తి నింపాయి...
undefined
స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన రవిశాస్త్రి... మొదట పదోస్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి, తర్వాత ఓపనర్‌గా మారారట... నేను కూడా అలాగే రాణించాలని కోరుకుంటున్నా...
undefined
జట్టులోకి వచ్చే కుర్రాళ్లుకు కావాల్సినంత అనుభవం, మోటివేషన్, స్ఫూర్తి... అంతా డ్రెస్సింగ్ రూమ్‌లోనే దొరుకుతోంది...
undefined
విరాట్ కోహ్లీ, రహానే, రోహిత్ శర్మ, జడేజా, అశ్విన్... ఇలా టాప్ క్లాస్ ప్లేయర్లు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు... వీరి సాయం మరువలేనిది..’ అంటూ చెప్పుకొచ్చాడు సుందర్.
undefined
గబ్బా టెస్టులో 62 పరుగులు చేసి, మూడు వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ పర్ఫామెన్స్ గురించి అతని తండ్రి పి. సుందర్‌ని అడగగా... ‘మా వాడు సెంచరీ చేస్తే బాగుండు...’ అని సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.
undefined
click me!