ఆసియా క్రీడలకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్! వన్డే వరల్డ్ కప్ ముగిశాక రాహుల్ ద్రావిడ్ ప్లేస్‌లోకి కూడా?

Published : Jul 18, 2023, 05:15 PM ISTUpdated : Jul 18, 2023, 05:16 PM IST

వచ్చే నాలుగు నెలల కాలంలో వరుస టోర్నీలతో బిజీబిజీగా గడపబోతోంది టీమిండియా. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా, ఆ తర్వాత మూడు మ్యాచుల వన్డే సిరీస్, ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది..

PREV
18
ఆసియా క్రీడలకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్! వన్డే వరల్డ్ కప్ ముగిశాక రాహుల్ ద్రావిడ్ ప్లేస్‌లోకి కూడా?
Dravid and Laxman

వెస్టిండీస్ టూర్ నుంచి ఐర్లాండ్‌ టూర్‌కి వెళ్తోంది టీమిండియా. ఈ టూర్‌లో మూడు టీ20 సిరీస్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌కి భారత ప్రధాన కోచింగ్ స్టాఫ్ దూరంగా ఉంటారు. వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా ఐర్లాండ్ టూర్ జరుగుతుంది...

28
VVS Laxman

ఐర్లాండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంకలో ఆసియా కప్ 2023 మ్యాచులు ఆడుతుంది టీమిండియా. ఈ టోర్నీకి రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్‌గా ఉంటాడు. ఆసియా కప్ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని ఓ జట్టు ఆసియా క్రీడల కోసం చైనాకి వెళ్తుంది..

38

మరో జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ వార్మప్ మ్యాచులతో బిజీగా గడపనుంది. చైనాకి వెళ్లే భారత పురుషుల జట్టుకి వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు. ప్రస్తుతం భారత మహిళల టీమ్‌కి కూడా కోచ్ లేడు..

48


ఇప్పటికే ఉమెన్స్ క్రికెట్ టీమ్‌కి హెడ్ కోచ్‌గా హృషికేశ్ కరిత్కర్ తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దీంతో ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత మహిళా, పురుషుల జట్టుకి వీవీఎస్ లక్ష్మణ్‌, మార్గనిర్దేశకుడిగా వ్యవహరించబోతున్నాడు..
 

58

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు ముగియనుంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా విజయం అందుకుంటే, ఆ విజయంతో హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నాడట..

68

ఒకవేళ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఓడితే, రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్‌ని కొనసాగించేందుకు బీసీసీఐ కూడా సుముఖత చూపించకపోవచ్చు. దీంతో రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది..

78
Sanju Samson and Ruturaj Gaikwad

ఇంతకుముందు రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో ఎన్‌సీఏ హెడ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్, శ్రీలంక పర్యటనలో భారత జట్టుకి తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. దీంతో అదే ఫార్ములాని వీవీఎస్ లక్ష్మణ్ విషయంలోనూ ఫాలో అవ్వబోతున్నట్టు సమాచారం.. 

88

ఒకవేళ ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్లు సరైన ప్రదర్శన ఇవ్వకపోయినా, ఆ ప్రభావం వీవీఎస్ లక్ష్మణ్‌‌పై పెద్దగా పడకపోవచ్చు. ఎందుకంటే ద్రావిడ్ కోచింగ్‌లో లంక పర్యటనలో టీమిండియా, టీ20 సిరీస్ కోల్పోయినా అతన్ని హెడ్ కోచ్‌గా నియమించింది బీసీసీఐ.. 
 

click me!

Recommended Stories