ఆర్ఆర్ఆర్‌లో వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ... తెలుగోడి ఎడిట్‌కి వీరూ ఫిదా...

First Published Jul 8, 2021, 3:22 PM IST

‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ రీసెంట్‌గా విడుదల చేసిన పోస్టర్‌కి విశేషమైన స్పందన వచ్చింది. క్రికెటర్ల నుంచి సినిమా స్టార్ల దాకా అందరూ తమకు నచ్చిన ఎడిట్స్‌ని పోస్టు చేశారు. రీసెంట్‌గా ఈ లిస్టులో భారత మాజీ క్రికెటర వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరాడు...

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్‌ సజావుగా సాగడానికి ప్రధాన కారణం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీయే. వీరూకి టీమిండియాలో చోటు కల్పించిన దాదా, అతన్ని ఓపెనర్‌గా కూడా చేశాడు...
undefined
అప్పటిదాకా వన్డేల్లో సచిన్ టెండూల్కర్‌తో కలిసి అనేక రికార్డులు క్రియేట్ చేసిన సౌరవ్ గంగూలీ, వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్ కోసం తన ఓపెనర్ ప్లేస్‌ని త్యాగం చేశాడు...
undefined
దాదా పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ బైక్ నడుపుతున్న ఫోటో ఎడిట్‌ని పోస్టు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇందులో ఎన్టీఆర్‌గా వీరూ బండి నడుపుతుంటే, దాదా వెనకాల అతని మీద చేతులు వేసి కూర్చున్నాడు...
undefined
బెజవాడ సాయి అనే తెలుగు కుర్రాడు ఎడిట్ చేసిన ఈ పిక్‌ను సోషల్ మీడయాలో పోస్ట్ చేసిన సెహ్వాగ్... ‘దాదా బండి మీద సవారి చేశా, దాదాతో కలిసి ప్రయాణించా. దాదా కెప్టెన్సీలో ఆడిన ఐదేళ్లు నా కెరీర్‌లో మధుర క్షణాలు’ అంటూ కాప్షన్ ఇచ్చాడు...
undefined
ట్విట్టర్‌లో వరుసగా దాదా గురించి చెబుతూ ట్వీట్లు వేసిన వీరేంద్ర సెహ్వాగ్, గత నాలుగేళ్లుగా గంగూలీ పుట్టినరోజున వేసిన ట్వీట్లను రీట్వీట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు...
undefined
‘కొందరు మాత్రమే దాదా క్రేజ్‌ను అందుకోగలరు, ఇంకొందరు మాత్రమే దాదా ఉద్దేశాన్ని గ్రహించగలరు... దాదా పుట్టినరోజు చాలా పెద్దది..’
undefined
‘స్పిన్నర్ల బౌలింగ్‌లో సిక్సర్లు కొడుతున్నట్టు మాత్రమే ఆయన ట్రాక్‌పై డ్యాన్స్ చేస్తున్నట్టుగా తన కళ్లను కొడతాడు... లేదంటే అస్సలు కనురెప్పలు కూడా వేయడు... నా కెరీర్ ఆరంభంలో మీరిచ్చిన సపోర్ట్‌కి మనసారా ధన్యవాదాలు తెలుపుతున్నా...’
undefined
‘హ్యాపీ బర్త్ డే టు 56 కెప్టెన్. దాదా... మీ ఛాతి 56 ఇంచులు... 7వ నెల, 8వ రోజు... రెండూ గుణిస్తే 56... మీ వరల్డ్‌కప్ సగటు కూడా 56...’
undefined
‘స్టెప్ 1 లేచి మీ కళ్లు రెండు సార్లు కొట్టండి, స్టెప్ 2 బౌలర్‌ని చితకబాదండి, కొన్నిసార్లు చూసేవాళ్లను కూడా, స్టెప్ 3 బంతినే కాదు, జట్టును కూడా తిప్పేయండి. స్టెప్ 4 మిమ్మల్ని ఎవ్వరూ చూడనట్టుగా సెలబ్రేట్ చేసుకోండి... అద్భుతమైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు...’
undefined
‘టెస్టు క్రికెట్‌లో నేనే ఎలాంటి సక్సెస్ అందుకున్నా... అది మొత్తం నాకు అండగా నిలిచిన నా కెప్టెన్ సౌరవ్ గంగూలీకే ఇచ్చేస్తున్నా...’ అంటూ 2017 నుంచి 2021 దాకా వేసిన వరుస ట్వీట్లను మరోసారి రీట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...
undefined
click me!