సౌరవ్ గంగూలీతో సచిన్, సెహ్వాగ్ క్రేజీ ఫ్రాంక్... బాత్రూమ్‌లో ఉన్నప్పుడు అలా చెప్పడంతో...

Published : Aug 27, 2023, 10:19 AM IST

ఇప్పుడు సిరీస్‌కో కెప్టెన్‌ని మారుస్తోంది టీమిండియా. వన్డే, టీ20, టెస్టులకు వేర్వేరుగా టీమ్స్ ఉన్నాయి. అయితే సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో వన్డే, టెస్టు టీమ్‌ల్లోనూ ఒకే టీమ్ ఉండేది. కేవలం 12-13 మంది మాత్రమే టీమ్‌లో ఉండేవాళ్లు. ఒకే రకమైన బ్యాటింగ్ లైనప్ ఉండేది..  

PREV
18
సౌరవ్ గంగూలీతో సచిన్, సెహ్వాగ్ క్రేజీ ఫ్రాంక్... బాత్రూమ్‌లో ఉన్నప్పుడు అలా చెప్పడంతో...

సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా కొనసాగినన్ని రోజులు, టీమ్‌లో పెద్దగా మార్పులు చేయడానికి కానీ, బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేయడానికి కానీ ఇష్టపడలేదు. గంగూలీ టీమ్‌లో భారత జట్టు సక్సెస్‌కి ఇది కూడా ఓ కారణం..

28

2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీ మొత్తంలో భారత జట్టు వాడింది కేవలం 12 మందిని. గంగూలీ కెప్టెన్సీలో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, అజిత్ అగార్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్, జహీర్ ఖాన్ వంటి క్రికెటర్లు టీమ్‌లోకి వచ్చారు. స్టార్ ప్లేయర్లుగా మారారు...

 

38
Sachin Sehwag Ganguly

సోషల్ మీడియా, మొబైల్స్ పెద్దగా లేని రోజుల్లో టీమ్‌లోని ఆటగాళ్ల మధ్య మంచి స్నేహం ఉండేది. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలంతా ఒకే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నా, వారి మధ్య ఎలాంటి ఇగోలు ఉండేవి కావు...

48

తాజాగా సచిన్ టెండూల్కర్‌తో కలిసి చేసిన సౌరవ్ గంగూలీపై చేసిన ఓ ఫ్రాంక్ గురించి బయటపెట్టాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

58

‘నేను, సచిన్, గంగూలీ అప్పట్లో అడిడాస్‌కి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నాం. సచిన్ పాజీ, నేను కలిసి గంగూలీతో ఓ ఫ్రాంక్ చేయాలని అనుకున్నాం..

68

గంగూలీ బాత్రూమ్‌లో ఉన్నప్పుడు మేం ఇద్దరం బయట ఉన్నాం. ‘‘భయ్యా... అడిడాస్ వాళ్లు పంపిన జర్మనీ టీషర్ట్ చాలా బాగుంది కదా..’’ అని సచిన్ అన్నారు. నేను దానికి, ‘అవును, పాజీ... చాలా బాగుంది.. ’’ అన్నాను.. మేం ఆ టీషర్ట్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నాం..

78

లోపలి నుంచి మా మాటలన్నీ విన్న, సౌరవ్ గంగూలీ బయటికి రాగానే అడిడాస్ వాళ్లకు ఫోన్ చేసి, ‘‘సచిన్, సెహ్వాగ్‌లకు పంపిన ఆ జర్మనీ టీ షర్డ్ నాక్కూడా పంపండి’’ అని అన్నాడు. వాళ్లకు ఏం జరిగిందో అర్థం కాక మాకు ఫోన్ చేసి... ‘‘భయ్యా... మేం మీకు ఏ టీ షర్ట్ పంపాము. దాదా ఫోన్ చేసి అడుగుతున్నాడు...’’ అని రిక్వెస్ట్ చేశారు..

88

సౌరవ్ గంగూలీకి జరిగింది తెలిసి, అంతా నవ్వుకున్నాం. అడిడాస్ వాళ్లకు మాత్రం ఏం జరిగిందో, దాదా ఎందుకు అలా ఫోన్ చేసి అడిగాడో ఇప్పటికీ తెలీదు..’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 

click me!

Recommended Stories