భువనేశ్వర్ కుమార్ ఫామ్ కోల్పోయి, వికెట్లు తీయడానికి కష్టపడుతుండడం, జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో అర్ష్‌దీప్ సింగ్‌కి వరుస అవకాశాలు ఇస్తూ వచ్చింది టీమిండియా. 2022 టీ20 వరల్డ్ కప్ ఆడిన అర్ష్‌దీప్ సింగ్, నో బాల్స్ వేయడంలో మాత్రం బుమ్రానే మించిపోయాడు...
భువనేశ్వర్ కుమార్‌ని సెలక్టర్లు పూర్తిగా పక్కనబెట్టేశారు. దీంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అర్ష్‌దీప్ సింగ్‌కి తప్పక చోటు దక్కుతుందని అనుకున్నారంతా. అయితే ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో అర్ష్‌దీప్ సింగ్‌కి చోటు దక్కింది...
27
Image credit: Getty
వన్డే వరల్డ్ కప్ 2023 ఆరంభమయ్యే సమయానికి ఆసియా క్రీడలు పూర్తి కావు. కాబట్టి ఆసియా క్రీడల్లో ఆడే రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్ వంటి టీమిండియా ప్లేయర్లు, వన్డే వరల్డ్ కప్ 2023 ఆడే అవకాశం ఉండదు..
37
‘వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ కాంబినేషన్ చాలా ముఖ్యం. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు వికెట్ కీపర్లు, ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు, ఓ పేస్ ఆల్‌రౌండర్, ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్, నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉంటే.. ఎలాంటి టీమ్‌నైనా ఓడించొచ్చు..
హార్ధిక్ పాండ్యా ఉన్నాడు కాబట్టి మరే పేస్ ఆల్‌రౌండర్‌కి టీమ్‌లో చోటు దక్కడం కష్టం. కుల్దీప్ యాదవ్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి చాహల్ కంటే అతన్ని వరల్డ్ కప్ ఆడించడమే న్యాయం. నలుగురు ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లను ఆడించాలి..
67
Arshdeep Singh
అర్ష్‌దీప్ సింగ్‌కి అనుభవం లేకపోయినా డెత్ ఓవర్లలో పరుగులు రాకుండా ఎలా నియంత్రించాలో అతనికి బాగా తెలుసు. అదీకాకుండా రెండేళ్లుగా అతను వైట్ బాల్ టీమ్‌లో రెగ్యూలర్‌గా ఆడుతున్నాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ భంగర్..
77
Arshdeep Singh
శార్దూల్ ఠాకూర్ కంటే అర్ష్‌దీప్ సింగ్‌ని ఆడించడమే బెటర్ అంటూ సంజయ్ భంగర్ వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పటిదాకా 3 వన్డేలు ఆడిన అర్ష్‌దీప్ సింగ్, ఒక్క వికట్ కూడా తీయలేకపోయాడు. 2019 వన్డే వరల్డ్ కప్ నుంచి టీమిండియా తరుపున అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా శార్దూల్ ఠాకూర్ ఉండడం విశేషం..