సచిన్ టెండూల్కర్, ధోనీ ఈ ఇద్దరి దగ్గర ఓ స్పెషల్ పవర్ ఉంది... మోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

First Published Aug 26, 2023, 5:44 PM IST

సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ... మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఈ ఇద్దరి క్రికెటర్ల తర్వాతే ఎవ్వరైనా. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత బయోపిక్ తీస్తే, మాహీ ఫుల్లు స్వింగ్‌లో ఆడుతున్నప్పుడే అతని జీవితంపై బయోపిక్ వచ్చింది. ఈ ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయంటున్నాడు భారత పేసర్ మోహిత్ శర్మ...
 

MS Dhoni, Mohit Sharma

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2013లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ, రెండేళ్ల పాటు టీమిండియాకి కీ ప్లేయర్‌గా ఉన్నాడు. 2015 వన్డే వరల్డ్ కప్ తర్వాత మోహిత్ శర్మ, పేలవ ఫామ్‌తో టీమ్‌లో చోటు కోల్పోయాడు..

ఐపీఎల్‌ 2014 సీజన్‌లో 23 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన మోహిత్ శర్మ, పేలవ ఫామ్‌తో టీమ్‌లో చోటు కోల్పోయాడు. ఆఖరికి 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్‌‌కి నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. నెట్ బౌలర్‌గా మోహిత్ చూపించిన పర్ఫామెన్స్, 2023 సీజన్‌లో అతని రీఎంట్రీకి కారణమైంది..

Latest Videos


2023 సీజన్‌లో 25 వికెట్లు తీసిన మోహిత్ శర్మ, మరో 2 మ్యాచులు ఆడి ఉంటే పర్పుల్ క్యాప్ కూడా గెలిచేవాడు. అత్యద్భుత బౌలింగ్ పర్ఫామెన్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ దాకా రావడానికి కారణమైన మోహిత్ శర్మ, టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకుంటాడని ప్రచారం జరిగినా... సెలక్టర్లు, అతన్ని పట్టించుకోలేదు..

‘మాహీ భాయ్‌కి ఓ స్పెషల్ పవర్ ఉంది. అతను క్రికెట్‌లో సాధించిన సక్సెస్ కారణంగా మాహీ స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. సచిన్ టెండూల్కర్‌ని మొదటిసారి చూసినప్పుడు ఓ దేవుడిని కలిసినట్టు ఫీల్ అవుతాం. అలాగే ధోనీని కలిసినప్పుడు కూడా ఆ ఫీలింగ్ కలుగుతుంది..
 

నేటి తరానికి ధోనీ, దేవుడితోనే సమానం. ప్రతీ మ్యాచ్ తర్వాత కుర్రాళ్లు, ధోనీ ఏం చెబుతాడా? అని ఎంతలా ఎదురుచూస్తున్నారు. మాహీ ఏం చెప్పినా అలా చేతులు కట్టుకుని ఎలా వింటున్నారో.. మాహీతో పాటు అతని ఈ పవర్ కూడా ప్రయనిస్తూ ఉంటుంది..

Mohit Sharma-hardik Pandya

మాహీతో ఉంటే అతనితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదో తెలుసుకోవాలనే తాపత్రయం కూడా అవసరం లేదు. మాహీ అన్నీ గ్రహించి, లాజికల్‌గా వివరిస్తూ ఉంటాడు. ఆ మాటలు జీవితాంతం వింటూనే వినాలని అనిపిస్తూ ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ బౌలర్ మోహిత్ శర్మ.. 

టీమిండియా తరుపున 26 వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడిన మోహిత్ శర్మ, మొత్తంగా 37 వికెట్లు పడగొట్టాడు. సందీప్ పాటిల్ తర్వాత ఆరంగ్రేటం వన్డేలోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు మోహిత్ శర్మ..
 

Mohit Sharma

ఐపీఎల్ 2023 ఫైనల్‌లో అజింకా రహానేని, అంబటి రాయుడిని అవుట్ చేసిన మోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీని గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆఖరి ఓవర్‌ వేసిన మోహిత్ శర్మ, మొదటి 4 బంతులు కట్టుదిట్టంగా వేసినా.. చివర్లో జడ్డూ 6,4 బాది మ్యాచ్‌ని ముగించాడు..
 

click me!