ఐదు వికెట్లతో అదరగొట్టిన సిరాజ్... బ్రిస్బేన్‌లో హైదరాబాదీ రికార్డు ప్రదర్శన...

First Published Jan 18, 2021, 1:25 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌ ప్రదర్శన ఆధారంగా, అంతకుముందు దేశవాళీ క్రికెట్‌లో కనబర్చిన బౌలింగ్‌ను బేస్ చేసుకుని ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టులకి ఎంపికయ్యాడు హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్. అయితే దురదృష్టవశాత్తు టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే సిరాజ్ తండ్రి మరణించాడు. క్రికెట్‌కే తన మొదటి ప్రాధాన్యం అంటూ తండ్రి కడసారి చూపులకి కూడా నోచుకుని సిరాజ్... తన మొట్టమొదటి టెస్టు సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

మొదటి టెస్టులో మహ్మద్ షమీ గాయపడడంతో అతని స్థానంలో బాక్సింగ్ డే టెస్టులో ఎంట్రీ ఇచ్చాడు సిరాజ్...
undefined
ఆడిన మొదటి టెస్టులోనే అదిరిపోయే ప్రదర్శన ఇచ్చిన సిరాజ్... తొలి ఇన్నింగ్స్‌లో 2, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు...
undefined
రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయంతో తప్పుకోవడంతో మూడో టెస్టులో బుమ్రాతో కలిసి ఓపెనింగ్ స్పెల్ వేశాడు సిరాజ్...
undefined
సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేసిన సిరాజ్... రెండో ఇన్నింగ్స్‌లో పుకోవిస్కీని పెవిలియన్ చేర్చాడు..
undefined
అయితే కీలకమైన నాలుగో టెస్టుకి ముందు భారత సీనియర్ బౌలర్లు అశ్విన్, బుమ్రా, జడేజా కూడా గాయంతో వెనుదిరగడంతో రెండు టెస్టుల అనుభవం మాత్రమే ఉన్న సిరాజ్... భారత బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించాడు.
undefined
నాలుగో టెస్టు ఆరంభానికి ముందు ఏ మాత్రం అనుభవం లేని భారత బౌలర్లు, ఆస్ట్రేలియాను ఎంత వరకూ ఇబ్బందిపెట్టగలరని అనుమానించారంతా... అయితే సిరాజ్ అండ్ కో టీమ్ అద్భుతమై చేసింది.
undefined
గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేసిన సిరాజ్... భారత బౌలర్లలో నమ్మకం పెంచాడు. 10 ఓవర్లు మెయిడిన్లు వేసి అదరగొట్టాడు...
undefined
రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసిన సిరాజ్... స్టీవ్ స్మిత్, లబుషేన్, మాథ్యూ వేడ్ వంటి కీలక బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేశాడు. స్మిత్, లబుషేన్‌లను ఒకే ఇన్నింగ్స్‌లో అవుట్ చేసిన మొదటి భారత బౌలర్‌ కూడా సిరాజ్‌యే.
undefined
బ్రిస్బేన్‌లో 2003లో జహీర్ ఖాన్ తర్వాత ఐదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ మహ్మద్ సిరాజ్... మొత్తంగా బ్రిస్బేన్‌లో ఈ ఫీట్ సాధించిన ఐదో భారత బౌలర్.
undefined
సిడ్నీ మైదానంలో ప్రేక్షకులతో జాతి వివక్ష దూషణలకు గురైన సిరాజ్... నాలుగో టెస్టులో తన ప్రదర్శనతోనే వారికి సమాధానం ఇచ్చాడు...
undefined
టెస్టు సిరీస్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్ కూడా మహ్మద్ సిరాజ్...
undefined
ఈ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు సిరాజ్. సిరాజ్ మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీయగా... రవిచంద్రన్ అశ్విన్ 12, బుమ్రా 11 వికెట్లతో తన తర్వాతి స్థానాల్లో నిలిచాడు. బుమ్రా, అశ్విన్ కూడా మూడేసి టెస్టులు ఆడారు.
undefined
తాను క్రికెట్‌లో రాణించడమే తన తండ్రి కోరిక అని... టెస్టు సిరీస్‌కి ముందు ప్రకటించిన సిరాజ్... దాన్ని చేతల్లో చేసి చూపించాడు...
undefined
నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఐదు వికెట్లు తీయగా శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టాడు... బ్రిస్టేన్‌లో భారత జట్టు తరుపున ఇద్దరు బౌలర్లు 4+ వికెట్లు తీయడం ఇదే మొదటిసారి.
undefined
గత 40 ఏళ్లలో గబ్బాలో ఆస్ట్రేలియాలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్ అవ్వడం ఇది మూడోసారి. విండీస్‌పై 1988లో, న్యూజిలాండ్‌పై 2008లో ఆసీస్ ఇలా ఆలౌట్ కాగా... భారతజట్టుపై మొదటిసారి.
undefined
మొదటి ఇన్నింగ్స్‌లో ఒకే వికెట్ తీసినా సిరాజ్ బౌలింగ్ అద్భుతమని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొనియాడిన సంగతి తెలిసిందే..
undefined
ఐదు వికెట్లు తీసిన సిరాజ్‌కు భారత జట్టు ఆత్మీయంగా స్వాగతించింది. భారత సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, సిరాజ్‌ను హత్తుకున్నాడు..
undefined
మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్ల ప్రదర్శనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్...

click me!