మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ కంటే గోల్ఫ్ బాగా ఆడతాడు... డబ్బులు తీసుకుంటూ, డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తాడు...

Published : Dec 09, 2020, 05:39 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున 13 మ్యాచులు ఆడిన మ్యాక్స్‌వెల్... ఒక్కటంటే ఒక్క సిక్స్‌కూడా బాదలేదు. దీంతో మ్యాక్స్‌వెల్‌ను పదికోట్ల ఖరీదైన ఛీర్ లీడర్ అంటూ విమర్శించాడు వీరేంద్ర సెహ్వాగ్. అయితే ఆ తర్వాత ప్రారంభమైన వన్డే, టీ20 సిరీస్2లో మాత్రం తన తడాఖా చూపించాడు మ్యాక్స్‌వెల్. మరోసారి మ్యాక్స్‌వెల్‌ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించాడు వీరూ.

PREV
112
మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ కంటే గోల్ఫ్ బాగా ఆడతాడు... డబ్బులు తీసుకుంటూ, డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తాడు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కటంటే ఒక్క సిక్సర్ బాదలేకపోయిన మ్యాక్స్‌వెల్... మొత్తంగా కలిపి 108 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

212

మ్యాక్స్‌వెల్ ఫెయిల్ కావడం వల్లే కొన్ని ఉత్కంఠ మ్యాచుల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆఖర్లో విజయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే మ్యాక్స్‌వెల్ ఫామ్ కోల్పోలేదని ఇండియా, ఆసీస్ టూర్‌లో స్పష్టమైంది.

312

ఐపీఎల్ తర్వాత మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ 6 ఇన్నింగ్స్‌లో కలిపి 16 సిక్సర్లు బాదాడు. ఓ అద్భుత హాఫ్ సెంచరీతో పాటు 150+ స్ట్రైయిక్ రేటుతో బౌండరీలు బాది భారీ స్కోర్‌కి తన వంతు పాత్ర పోషించాడు.

412

ఐపీఎల్ ప్రదర్శన తర్వాత ‘మ్యాక్స్‌వెల్‌ను 10 కోట్ల ఛీర్ లీడర్’ అంటూ విమర్శించిన వీరేంద్ర సెహ్వాగ్, భారత్‌తో జరిగిన రెండు సిరీస్‌ల్లో అతని ప్రదర్శన చూసిన తర్వాత మరింతగా ట్రోల్ చేశాడు.

512

‘ఆస్ట్రేలియాకి ఆడుతున్నప్పుడు మ్యాక్స్‌వెల్ యాటిట్యూడ్‌ పూర్తిగా మారిపోతుంది... జాతీయ జట్టు తరుపున ఆడుతున్నప్పుడు ఒకటి రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయితే జట్టులో స్థానం పోతుందని మ్యాక్స్‌వెల్‌కి తెలుసు..

612

ఒక్కసారి జట్టులో చోటు కోల్పోతే కమ్‌బ్యాక్ ఇవ్వడం కూడా కష్టమని మ్యాక్స్‌వెల్‌కి తెలుసు... అందుకే బాధ్యతతో ఆడతాడు. అదే ఐపీఎల్‌లో ఆడినప్పుడు ఏ మాత్రం ప్రెషర్ తీసుకోకుండా బ్యాటింగ్ చేస్తాడు...

712

తను కేవలం ఎంజాయ్‌మెంట్ కోసం మాత్రమే ఐపీఎల్ ఆడతాడు. మ్యాచ్‌లో అన్నీ చేస్తాడు... ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తాడు, చుట్టూ తిరుగుతాడు, డ్యాన్స్ చేస్తాడు... స్కోరు మాత్రం చేయడు...

812

మ్యాచ్ అయిపోయిన వెంటనే ఫ్రీ డ్రింక్స్ వస్తాయి... అవి తీసుకోని రూమ్‌కి వెళతాడు... ఫుల్లుగా తాగుతాడు....’ అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.

912

‘నా వరకైతే మ్యాక్స్‌‌వెల్, ఐపీఎల్‌ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకున్నట్టు అనిపించలేదు. ఐపీఎల్ కంటే గోల్ఫ్ ఆడేటప్పుడే మ్యాక్స్‌వెల్ బాగా ఆడతాడు... ఎందుకంటే నువ్వు సీరియస్‌గా ఆడితే పర్ఫామెన్స్‌లో కనబడుతుంది’ అంటూ వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్.

1012

మొదటి వన్డేలో బుమ్రా బౌలింగ్‌లో కూడా ఈజీగా సిక్సర్లు బాదిన మ్యాక్స్‌వెల్... ‘కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌కి సారీ’ చెప్పానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

1112

మొదటి వన్డేలో 19 బంతుల్లో 45 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్, రెండో వన్డేలో 29 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఆఖరి వన్డేలో 59 పరుగులతోనూ రాణించాడు. వన్డేల్లో చేసిన అత్యల్ప స్కోరు కూడా ఐపీఎల్ 2020లో అతని అత్యధిక స్కోరు (34) కంటే తక్కువ. 

1212

ఐపీఎల్ ప్రదర్శన అనంతరం ‘పది కోట్ల ఛీర్ లీడర్ అని వీరూ చేసిన కామెంట్‌పై స్పందించిన మ్యాక్స్‌వెల్, అతని ఆవేదనను అర్థం చేసుకోగలనని, ఈ కామెంట్లను బూస్టింగ్‌గా తీసుకుంటానని చెప్పాడు. చెప్పినట్టే టీమిండియాపై అదరగొట్టాడు. మరి ఈసారి వీరూ చేసిన కామెంట్లపై మ్యాక్స్‌వెల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

click me!

Recommended Stories