ఆ విషయంలో 71 కొట్టేసిన విరాట్ కోహ్లీ... నూరో టెస్టులో ఊరిస్తున్న సెంచరీకి...

Published : Feb 28, 2022, 04:10 PM IST

రన్ మెషిన్‌ నుంచి పరుగుల ప్రవాహం ఆగలేదు, అయితే మూడంకెల స్కోరు మాత్రం విరాట్ కోహ్లీని రెండున్నరేళ్లుగా ఊరిస్తోంది. బుల్లెట్ వేగంతో 70 సెంచరీలు బాదేసిన విరాట్ కోహ్లీని, 71వ శతకం మాత్రం అందని ద్రాక్షలా మారింది...

PREV
19
ఆ విషయంలో 71 కొట్టేసిన విరాట్ కోహ్లీ... నూరో టెస్టులో ఊరిస్తున్న సెంచరీకి...

గత రెండేళ్లలో 21 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, సెంచరీ మార్కుకి దగ్గర దాకా వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి...

29

మొహాలీ వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరిగే టెస్టు, విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ...

39

కరోనా నిబంధనల కారణంగా మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులను అనుమతించకపోయినా, వేల సంఖ్యలో అభిమానులు విరాట్ కోహ్లీకి స్వాగతం పలికేందుకు హోటల్‌కి రాబోతున్నారు.

49

71వ సెంచరీ అందుకోకపోయినప్పటికీ మొహాలీ టెస్టు ద్వారా విరాట్ కోహ్లీ, రెండు విషయాల్లో 71 మార్కును అందుకోబోతున్నాడు...

59

ఓవరాల్‌గా 100+ టెస్టులు ఆడిన 71వ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు విరాట్ కోహ్లీ... భారత జట్టు తరుపున 100+ ఆడబోతున్న 12వ క్రికెటర్ విరాట్...

69

ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ (200), రాహుల్ ద్రావిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్‌సర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), ఇషాంత్ శర్మ (105), హర్భజన్ సింగ్ (103), వీరేంద్ర సెహ్వాగ్ (103) మ్యాచులు ఆడి విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు...

79

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కెరీర్‌లో 99 టెస్టులు ఆడగా, ఛతేశ్వర్ పూజారా 95 టెస్టులతో ఉన్నాడు...

89

అదీకాకుండా వెస్టిండీస్‌పై 70వ అంతర్జాతీయ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, సెంచరీ లేకుండా 70 ఇన్నింగ్స్‌లు ఆడేశాడు. లంకపై ఆడబోయే ఇన్నింగ్స్‌ 71వది...
 

99

71వ సెంచరీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ, 100వ టెస్టులో అది కాస్తా బాదేస్తే... అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

Read more Photos on
click me!

Recommended Stories