Virat Kohli: టీమిండియా మాజీ సారథి, రన్ మిషీన్ విరాట్ కోహ్లీ త్వరలో విండీస్ టూర్ తర్వాత ఆసియా కప్ కూడా ఆడనున్నాడు. ఇందులో వింతేముంది..? గతేడాది కూడా కోహ్లీ ఆసియా కప్ ఆడాడు కదా..!
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఆసియా కప్ లో 9 ఏండ్ల తర్వాత ఆడనున్నాడు. అదేంటి..? కోహ్లీ లాస్ట్ ఈయర్ ఆసియా కప్ ఆడాడు కదా.. ఆఫ్గానిస్తాన్ మీద సెంచరీ కూడా చేశాడు అనుకుంటున్నారా..?
26
Image credit: PTI
అవును. కోహ్లీ మూడేండ్ల గ్యాప్ తర్వాత మునపటి ఫామ్ ను అందుకుంది గతేడాది ఆసియా కప్ లోనే.. టీ20లలో మొదటి సెంచరీ చేసింది ఆఫ్గానిస్తాన్ మీదే.. కానీ అవి టీ20లు. ఈ ఏడాది ఆగస్టు నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరిగే ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో ఆడనున్నారు.
36
Image credit: PTI
ఆసియా కప్ ను సాధారణంగా ఆ ఏడాది ఐసీసీ టోర్నీని బట్టి ఏ ఫార్మాట్ టోర్నీ జరుగబోతుంటే దానిని ఆడిస్తారు. గతేడాది టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియా కస్ పొట్టి ఫార్మాట్ లో సాగింది. ఈ ఏడాది భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఉంది. దీంతో ఈ ఏడాది ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో జరుగనుంది.
46
Image credit: PTI
కోహ్లీ చివరిసారిగా 2014లో ఆసియా కప్ ఆడాడు. 2015 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో అంతకుముందు ఏడాది వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ జరిగింది. ఆ టోర్నీలో కోహ్లీ ఆడాడు. ఆ తర్వాత ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో 2018 లో జరిగింది. కానీ 2018లో కోహ్లీకి సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా కోహ్లీకి ఆ ఏడాది విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. దీంతో ఆ ఏడాది భారత జట్టును రోహిత్ శర్మ నడిపించాడు. 2018లో భారత జట్టు కప్పు కూడా కొట్టింది.
56
2014లో భారత జట్టు ఆసియా కప్ లో దారుణంగా విఫలమైంది. ఈ టోర్నీలో కోహ్లీ.. ఓ సెంచరీ, మూడు అర్థ సెంచరీలు చేసినా భారత జట్టు మాత్రం ఫైనల్ చేరడంలో విఫలమైంది. లీగ్ దశలో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లను ఓడించిన భారత జట్టు.. సూపర్ - 4లో పాకిస్తాన్ చేతిలో ఓడింది.
66
Image credit: PTI
ఇక కోహ్లీ ఆసియా కప్ లో 10 మ్యాచ్ లు (వన్డే ఫార్మాట్) ఆడి 61.3 సగటుతో 613 పరుగులు చేశాడు. కోహ్లీ హయ్యస్ట్ స్కోరు (183) కూడా ఇక్కడే నమోదైంది. 2018 తర్వాత కరోనా, ఇతరత్రా కారణాలతో ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో జరుగనుండటం ఇదే ప్రథమం. మరి 9 ఏండ్ల తర్వాత బరిలోకి దిగబోతున్న కోహ్లీ.. ఈ ఆసియా కప్ లో ఏ మేరకు ఆడతాడో వేచి చూడాలి.