ఐపీఎల్ 2023 సీజన్‌లో పర్ఫామెన్స్ కంటే విరాట్ కోహ్లీతో గొడవ పడి, ట్రెండింగ్‌లో నిలిచాడు ఆఫ్ఘాన్ క్రికెటర్ నవీన్ వుల్ హక్. ఆర్‌సీబీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో నానా రచ్చ జరగడానికి ఈ పోరగాడి యాటిట్యూడ్ కూడా ఓ కారణం..
లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం చేసే సమయంలో నవీన్ వుల్ హక్, విరాట్ కోహ్లీ చేతిని మెలితప్పి, ఏదో నిలదీయడం కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
28
Kohli-Naveen-Ul Haq
ఈ సంఘటన తర్వాత గౌతమ్ గంభీర్ కూడా వచ్చి వాగ్వాదానికి దిగాడు. అసలు ఇంత రచ్చ జరిగినా అందులో తన తప్పేం లేదంటున్నాడు ఆఫ్ఘాన్ క్రికెటర్ నవీన్ వుల్ హక్...
38
naveen ul haq
‘మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీ చాలా అన్నాడు, అయితే నేను అవన్నీ భరించాను. మ్యాచ్ తర్వాత కూడా గొడవ ముందు మొదలెట్టింది అతనే. మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో విరాట్ నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు..
48
అంతెందుకు మాకు పడిన ఫైన్స్‌ని గమనిస్తే ఎవరి తప్పు ఉందో అర్థం అవుతుంది. అతనికి 100 శాతం ఫైన్ వేస్తే, నాకు 50 శాతం ఫైన్ మాత్రమే పడింది. నేను సాధారణంగా ఎవరితోనూ గొడవ పడను..
58
Virat Kohli-Naveen Ul Haq Fight
నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. ఆ మ్యాచ్‌లో నేను ఒక్క మాట కూడా అనలేదు. ఎవరిని సెడ్జ్ కూడా చేయలేదు. అయినా నా జోలికి వచ్చాడు. అక్కడికీ ఆ పరిస్థితిని నేను ఎలా ఢీల్ చేశానో అక్కడున్న ప్లేయర్లు అందరూ చూశారు...
68
Naveen Ul Haq Mumbai Indians
నేను కూడా మనిషినే, అందుకే రియాక్ట్ అయ్యాను. ఈ గొడవ తర్వాత జనాలు నన్ను తిడుతూ పోస్టులు పెట్టారు, మెసేజ్‌లు చేశారు. వాళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. 80 వేల మంది మెసేజ్‌లు చేసి ఉంటారు, అందరినీ పట్టించుకునే సమయం నా దగ్గర లేదు...
78
Virat Kohli-Naveen Ul Haq
నా టాలెంట్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా ఫోకస్ అంతా క్రికెట్‌పైనే. నా పర్ఫామెన్స్ మాత్రమే మాట్లాడాలని అనుకుంటున్నా. గ్రౌండ్‌లో జరిగిన దాన్ని సోషల్ మీడియాలోకి లాగే వ్యక్తిని కూడా కాను.
88
కానీ అతను అలా చేసినప్పుడు నన్ను నేను ఎలా కంట్రోల్ చేయగలను. అయినా నేను ఏ వ్యక్తి పేరును ప్రస్తావించలేదు. కేవలం నా మ్యాంగోస్ ఎంజాయ్ చేస్తున్నా అని మాత్రమే పోస్ట్ చేశా...’ అంటూ కామెంట్ చేశాడు నవీన్ వుల్ హక్..