విరాట్ నన్ను తిట్టేవాడు, చాలా భయపడేవాడిని... స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ కామెంట్స్...

Published : Feb 05, 2022, 05:33 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలంలో హాట్ ఫెవరెట్ ప్లేయర్లలో యజ్వేంద్ర చాహాల్‌ కూడా ఒకడు. ఆర్‌సీబీలో కీలక ప్లేయర్‌గా ఉంటూ వచ్చిన చాహాల్, ఈసారి మెగా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు...

PREV
111
విరాట్ నన్ను తిట్టేవాడు, చాలా భయపడేవాడిని... స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ కామెంట్స్...

కెరీర్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ తరుపున మూడు సీజన్లు ఆడిన యజ్వేంద్ర చాహాల్, 2014 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో కీలక ప్లేయర్‌గా ఉంటూ వచ్చాడు...

211

2014లో చాహాల్‌ని బేస్ ప్రైజ్ రూ.10 లక్షలకు 2018లో రైట్ టు మ్యాచ్ కార్డు వాడి రూ.6 కోట్లకు తిరిగి టీమ్‌లోకి తెచ్చుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

311

‘2014లో నేను మొదటి సారి ఆర్‌సీబీలోకి వెళ్లినప్పుడు చాలా కొత్తగా అనిపించింది, మ్యాచులు జరుగుతున్నప్పుడు కూడా కాస్త ఇబ్బందిపడ్డాను...

411

విరాట్ కోహ్లీ కవర్స్‌లో ఫీల్డింగ్ చేసేవాడు. ఆయన ఎప్పుడూ రెడ్ బుల్ తాగినట్టుగా ఫుల్ ఎనర్జీతో ఎంతో అగ్రెసివ్‌గా ఉండేవాడు...

511

నేనేమో అప్పుడు కుర్రాడిని, ఏదైనా చిన్న తప్పు చేస్తే నన్ను తిట్టేవాడు, కోపడేవాడు. నాకు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు... 

611

అందుకే వికెట్లు తీసిన తర్వాత ఆ కోపాన్ని మొత్తం చూపిస్తూ గట్టిగా అరిచేవాడు. ఇలా రెండు మూడు సార్లు అయిన తర్వాత అంపైర్, మ్యాచ్ రిఫరీ ఈ విషయాన్ని గుర్తించారు...

711

మ్యాచ్ రిఫరీ ఓసారి కోచ్ డానియల్ విటోరీని దీని గురించి అడిగాడు. దాంతో ఓ మ్యాచ్‌ సమయంలో నేను, అలాగే వికెట్ తీసిన తర్వాత బ్యాట్స్‌మెన్‌ని ఏదో అన్నాను...

811

అది చూసిన విటోరీ సర్ నా దగ్గరికి వచ్చి, ‘నువ్వు ఇలా చేయడం ఏం బాగోలేదు. నీ దగ్గర సత్తా ఉంది, ఇలాంటివి చేయడం మంచిది కాదు...

911

వికెట్ తీసిన తర్వాత ఊరుక్కుంటూ వెళ్లి, ఏదైనా అనాలని అనుకుంటే, అదో విరాట్ దగ్గరికి వెళ్లి అనేసేయ్... అతనేమీ అనుకోడు... అంటూ చెప్పాడు... 

1011

ఆ సలహా విని నాకు దెబ్బకు తడిసిపోయినంత పనైంది. అందుకే ఆ తర్వాత అలా అనడం మానేశాను...’ అంటూ చెప్పుకొచ్చాడు యజ్వేంద్ర చాహాల్...

1111

ఐపీఎల్ 2022 మెగా వేలంలో తనకు రూ.12-15 కోట్లు వద్దని, ఓ రూ.8 కోట్లు అయితే చాలని ఫన్నీగా కామెంట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్...

Read more Photos on
click me!

Recommended Stories