11 టెస్టుల్లో ఒకే ఒక్కటి... చెన్నై టెస్టు ఫలితాన్ని డిసైడ్ చేసింది అదే... విరాట్ కోహ్లీ అలా చేసి ఉంటే...

First Published Feb 9, 2021, 3:25 PM IST

మ్యాచ్ ఫలితాన్ని టాస్ కూడా నిర్ణయిస్తుంది. మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కి చక్కగా సహకరించిన పిచ్‌పై టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జో రూట్, బ్యాటింగ్ ఎంచుకున్నాడు. డబుల్ సెంచరీతో ఇంగ్లాండ్‌కి భారీ స్కోరును అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ చేసిన 578 పరుగులే భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అద్భుతంగా కమ్ బ్యాక్ ఇచ్చినా, అప్పటికే ఆలస్యమైంది. 

గత 11 మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్కసారి టాస్ గెలిచాడు విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్ టూర్‌లో రెండు టెస్టు సిరీస్ కోల్పోయిన విరాట్, ఆడిలైడ్‌లో ఆసీస్‌తో టెస్టు మ్యాచ్ ఓడిన విషయం తెలిసిందే. ఇప్పుడు చెన్నై ఓటమితో కలిపి వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది టీమిండియా...
undefined
న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌కి ముందు వరుసగా ఏడు మ్యాచుల్లో వరుస విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, తాజాగా వరుసగా నాలుగు ఓటములు ఎదుర్కొన్నాడు. అయితే ఈ 11 మ్యాచుల్లో విరాట్ కోహ్లీ కేవలం ఒకేసారి టాస్ గెలిచాడు. గత ఆసీస్ పర్యటనలో మూడు టెస్టులకు నాయకత్వం వహించిన అజింకా రహానే కూడా మూడు మ్యాచుల్లోనూ టాస్ ఓడాడు.
undefined
నాలుగో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఆసియాలో నాలుగు వేల పరుగులను పూర్తిచేసుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధికసార్లు 50+ స్కోరు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు కోహ్లీ. ఇంతకుముందు రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ రెండేసి సార్లు ఈ ఫీట్ సాధించగా, విరాట్ కోహ్లీ నాలుగోసారి హాఫ్ సెంచరీ దాటాడు.
undefined
టెస్టు కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన నాలుగో కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. క్లైవ్ లార్డ్ 5233 పరుగుల రికార్డును అధిగమించిన విరాట్ కోహ్లీ... గ్రేమ్ స్మిత్ 8659, ఆలెన్ బోర్డర్ 6623, రికీ పాంటింగ్ 6542 తర్వాత అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా నాలుగో స్థానంలో ఉన్నాడు.
undefined
గత పదేళ్లలో భారత జట్టు స్వదేశంలో నాలుగు టెస్టుల్లో ఓడగా... అందులో మూడు మ్యాచులు ఇంగ్లాండ్ చేతుల్లోనే ఓడింది. ఓ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్‌పై గెలిచింది. 2017లో పూణెలో ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ ఓడిన విరాట్ కోహ్లీ, మళ్లీ నాలుగేళ్లకు స్వదేశంలో పరాజయాన్ని చవిచూశాడు...
undefined
రోహిత్ శర్మకు స్వదేశంలో ఇది 15వ టెస్టు. ఇప్పటిదాకా రోహిత్ శర్మ ఆడిన 14 మ్యాచుల్లో 13 మ్యాచుల్లో విజయం సాధించింది టీమిండియా. ఓ మ్యాచ్‌ డ్రా అయ్యింది. రోహిత్ శర్మ జట్టులో ఉండి, స్వదేశంలో టీమిండియా టెస్టు మ్యాచ్ ఓడడం ఇదే తొలిసారి...
undefined
మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింకా రహానే క్లీన్ బౌల్డ్ అయ్యారు. టాప్ 5 బ్యాట్స్‌మెన్లలో నలుగురు క్లీన్‌బౌల్డ్ అవ్వడం గత 8 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిగా ఆస్ట్రేలియాపై ఇలా జరిగింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియాపైనే భారత బ్యాట్స్‌మెన్ బౌల్డ్ కావడం విశేషం.
undefined
26 విజయాలు అందుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్‌గా మైఖేల్ వాగన్ రికార్డును సమం చేశాడు. ఇంకో టెస్టు గెలిస్తే, ఇంగ్లాండ్‌కి అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తాడు జో రూట్...
undefined
శ్రీలంకను వరుసగా ఐదు టెస్టుల్లో ఓడించిన జో రూట్, భారత జట్టుపై తొలి టెస్టు గెలిచి, డబుల్ హ్యాట్రిక్ అందుకున్నాడు. స్వదేశంలో భారత జట్టుకి ఇంగ్లాండ్‌పై ఇది 14వ పరాజయం. విండీస్‌పై మాత్రమే ఇన్ని మ్యాచుల్లో ఓడింది టీమిండియా. ఆస్ట్రేలియాపై 13 మ్యాచుల్లో ఓడింది భారత జట్టు.
undefined
click me!