చాలా తెలివిగా అశ్విన్‌ని సైడ్ చేశావ్ విరాట్ కోహ్లీ... వికెట్లు తీయలేని జడేజా కోసం... ఫ్యాన్స్ ఫైర్...

Published : Sep 06, 2021, 05:11 PM IST

ఇంగ్లాండ్ సిరీస్‌లో మొదటి టెస్టు నుంచి టీమిండియా ఎక్కువగా మిస్ అయ్యింది ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌నే... స్పిన్ ఆల్‌రౌండర్‌గానే కాకుండా, బౌలింగ్ విభాగాన్ని నడిపించడంలో సూపర్ సక్సెస్ అయ్యే అశ్విన్ లేని లోటు, టీమిండియాలో స్పష్టంగా కనిపించింది...

PREV
113
చాలా తెలివిగా అశ్విన్‌ని సైడ్ చేశావ్ విరాట్ కోహ్లీ... వికెట్లు తీయలేని జడేజా కోసం... ఫ్యాన్స్ ఫైర్...

తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ లేకపోవడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి... ఇంగ్లాండ్‌కి భారీ స్కోరు అందించాడు.. 

213

అయితే భారత ఫాస్ట్ బౌలర్లు రాణించడంతో తొలి టెస్టులో విజయం దాకా వచ్చి, వర్షం కారణంగా ఆ మార్కును అందుకోలేకపోయింది టీమిండియా... ఆ మ్యాచ్ తర్వాతైనా రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వస్తాడని అనుకున్నారు.

313

అయితే రెండో టెస్టులో విజయం తర్వాత విన్నింగ్ కాంబినేషన్ పేరుతో మూడో టెస్టులోనూ అదే జట్టును కొనసాగించాడు విరాట్ కోహ్లీ... 

413

మూడో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన తర్వాత కూడా ‘మ్యాచ్ విన్నర్’ రవిచంద్రన్ అశ్విన్‌కి తుదిజట్టులో చోటు దక్కలేదు. శార్దూల్, ఉమేశ్ యాదవ్ వంటి ప్లేయర్లను జట్టులోకి తెచ్చిన కోహ్లీ, అశ్విన్‌కి మాత్రం చోటు ఇవ్వలేదు...

513

రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు ఇవ్వకపోవడానికి విరాట్ కోహ్లీ చెబుతున్న మాట... ఒకే స్పిన్నర్, నలుగురు ఫాస్ట్ బౌలర్లతో వెళ్లాలని నిర్ణయించుకోవడం. అయితే స్పిన్నర్‌గా జడేజాకి చోటు ఇచ్చే కంటే అదే ప్లేస్ అశ్విన్‌కి ఇవ్వొచ్చుకదా అన్నది క్రికెట్ విశ్లేషకుల భావన...

613

జడేజాకి స్పిన్ ఆల్‌రౌండర్‌గా తుదిజట్టులో చోటు ఇస్తున్నాడు విరాట్ కోహ్లీ. అయితే జడ్డూ బౌలర్‌గా పెద్దగా రాణించింది లేదు. తొలి రెండు టెస్టుల్లో ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు జడేజా...

713

మూడో టెస్టులో రెండు వికెట్లు తీసినా, అది మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఏమీ కాదు... అయినా కూడా జడేజాని కొనసాగిస్తూ, రవిచంద్రన్ అశ్విన్‌ని పక్కనబెడుతూ రావడం టీమిండియా ఫ్యాన్స్‌కి కొత్త అనుమానాలకు తావిస్తోంది...

813

నాలుగో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ లాంటి ప్లేయర్ లేకపోవడం జట్టుకి విజయాన్ని దూరం చేసినట్టే కనిపిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్‌పై భారీ ఆధిక్యం సాధించిన ఇంగ్లాండ్, రెండో ఇన్నింగ్స్‌లోనూ మంచి స్కోరు దిశగా సాగుతోంది..

913

జడేజా స్పిన్‌తో మ్యాజిక్ చేయలేడు. అతనికి టీ20, వన్డేల్లో వికెట్లు దక్కినా, అవి బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు ఆడాలనే తాపత్రయంతో గాల్లోకి బంతి లేపినప్పుడు మాత్రమే వికెట్లు దక్కాయి....

1013

అలాంటి బౌలర్‌ను కొనసాగిస్తూ, బంతిని తిప్పుతూ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టే రవిచంద్రన్ అశ్విన్‌ను తప్పించడం... ఎలాంటి కెప్టెన్సీయో చెప్పాలంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

1113

టెస్టుల్లో మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌తో టీమిండియా విజయాల్లో ఎక్కువ శాతం క్రెడిట్ కొట్టేస్తున్నాడనే కారణంగానే అశ్విన్‌ను పక్కా ప్లాన్‌తో కోహ్లీ పక్కనబెడుతున్నాడని అంటున్నారు మరికొందరు...

1213

రవిచంద్రన్ అశ్విన్‌కి జట్టులో చోటు దక్కకపోవడం, ప్రస్తుతం టీమ్ ఉన్న పరిస్థితి చూసి... క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం కోహ్లీ నిర్ణయంపై చాలా కోపంగా ఉన్నారు...

1313

విరాట్ కోహ్లీ ఏం చెబితే, దానికి తల ఊపే నామమాత్రపు హెడ్ కోచ్ రవిశాస్త్రి ఉన్నంతకాలం జట్టు పరిస్థితి ఇలాగే ఉంటుందని, సాధ్యమైనంత త్వరగా అతన్ని తొలగించాలని కోరుకుంటున్నారు అభిమానులు. టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కూడా ఈ విధంగానే ట్వీట్ చేశాడు. 

click me!

Recommended Stories