Image Credit: Getty Images
31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాని విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా కలిసి ఆదుకున్నారు. పాండ్యా ఆఖరి ఓవర్‌లో అవుట్ అయినా 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు...
‘నా వరకూ పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి అతనిలో నేను చేయగలననే నమ్మకం కనిపించింది. తనపై వస్తున్న విమర్శలకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు...
అయితే నేను విరాట్ కోహ్లీ టీ20ల నుంచి రిటైర్ అవ్వాలని అనుకుంటున్నా. ఎందుకంటే అతను అనవసరంగా టీ20ల కోసం తన పూర్తి ఎనర్జీని వాడుతున్నాడు. టీ20ల్లో ఈ ఇన్నింగ్స్ కోసం ఎనర్జీతో వన్డేల్లో మూడు సెంచరీలు చేయొచ్చు...
విరాట్ కోహ్లీ 100 సెంచరీలు అందుకోవాలని కోరుకునే వారిలో నేను ఒకడిని. అందుకే విరాట్ కోహ్లీ టీ20ల నుంచి తప్పుకుంటే బెటర్. మూడేళ్ల నుంచి అతను సరైన ఫామ్‌లో లేడు. పరుగులు చేయలేకపోయాడు. కెప్టెన్సీ వదిలేశాడు..
జనాలు అతని కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశాడు. అయితే దీవాళికి ముందు ధమాకా ఇన్నింగ్స్‌తో ఆ అందరికీ సమాధానం ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో ఓ ఫైర్ క్రాకర్‌లా పేలింది... కింగ్ ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్... అతను ఓ గొప్ప క్రికెటర్’ అంటూ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...
విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్ అని పొగుడుతూనే, టీ20ల నుంచి తప్పుకోవాలని అక్తర్ కోరుతున్నాడంటే, తమ టీమ్‌పై ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఎన్ని ఆడతాడోనని అతను భయపడుతున్నట్టు ఉందని ఈ యూట్యూబ్ వీడియోపై కామెంట్లు పెడుతున్నారు టీమిండియా అభిమానులు...