ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి టీమిండియా విజయానికి 1 పరుగు కావాల్సి ఉండగా స్ట్రైయిక్‌లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్... ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు. ఈ విన్నింగ్ షాట్ తర్వాత స్టేడియంలో ఉన్న 90,293 మంది ప్రేక్షకులు ఒక్కసారిగా విజయానందంతో అరిచారు...
స్టేడియంలో ఉన్నవారిలో 80 శాతానికి పైగా భారత క్రికెట్ ఫ్యాన్స్ సపోర్టర్లే కాగా పాక్ అభిమానులు కూడా తమదే అనుకున్న మ్యాచ్‌లో టీమిండియా విజయాన్ని తట్టుకోలేక అరిచి గోల శారు. ఒకరి ఆనందం, మరొకరి ఆర్తనాదం... రెండు కలిసి ఆఖరి బంతి తర్వాత మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో పుట్టిన శబ్ద తరంగాలు, 2 కిలో మీటర్ల దూరానికి పైగా వినిపించాయి...
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, 2006లో బాక్సింగ్ డే టెస్టులో 89,155 మంది ప్రేక్షకుల మధ్య 700వ టెస్టు వికెట్ తీసినప్పుడు... ప్రేక్షకుల గోలలతో పుట్టిన శబ్దం కంటే ఇది రెండింతలు ఎక్కువ...
ఇప్పటిదాకా అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన మ్యాచ్‌గా 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కి 93,013 మంది ప్రేక్షకులు వచ్చారు. ఫైనల్‌లో మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ని క్లీన్ బౌల్డ్ చేయగానే స్టేడియమంతా మార్మోగిపోయింది...
అయితే ఫైనల్ మ్యాచ్‌లో సొంత ఆస్ట్రేలియా మైదానంలో ఆసీస్ క్రికెట్ ఫ్యాన్స్ చేసిన సౌండ్ కంటే భారత్- పాక్ మ్యాచ్ మూడింతల సౌండ్‌ని సృష్టించింది. మొత్తానికి భారతదేశానికి బయట టీమిండియా క్రేజ్ ఏంటో ఒక్క మ్యాచ్ ద్వారా తేలిపోయింది...
పాక్ ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు బిగ్ స్క్రీన్ మీద బాబర్ ఆజమ్ పేరు కనిపించగానే పాక్ ఫ్యాన్స్ కేకలతో అతనికి స్వాగతం పలికారు. అయితే విరాట్ కోహ్లీ పేరు కనిపించినప్పుడు అంతకు పదింతలు హంగామా చేశారు టీమిండియా అభిమానులు... ఆస్ట్రేలియాలో విరాట్‌కి ఉన్న క్రేజ్‌కి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ.
Image credit: Getty
మొత్తానికి విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి బంతికి హై టెన్షన్ థ్రిల్లర్‌గా సాగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్... అటు టీఆర్పీ, హాట్ స్టార్ రికార్డులనే కాదు, సౌండ్ వేవ్స్ రికార్డులను కూడా తిరగ రాసేసింది..