విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా కొనసాగు... టెండూల్కర్ అదే చేశాడు... సునీల్ గవాస్కర్ కామెంట్..

First Published Mar 22, 2021, 1:05 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ, 20 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు భారీ స్కోరు చేయగలిగింది...

‘ఐపీఎల్‌లోనూ ఓపెనర్‌గా కొనసాగుతా’ నని ప్రకటించిన విరాట్ కోహ్లీ, టీ20ల్లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా దిగుతానని చెప్పాడు. దీనిపై స్పందించాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
undefined
‘ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా మిడిల్ ఓవర్లలోనే ఆడేవాడు. కానీ ఓపెనర్‌గా వచ్చాకే అతని సత్తా ప్రపంచానికి తెలిసింది. టెండూల్కర్ ఓపెనర్‌గా మారిన తర్వాత టీమిండియా ఆటతీరు పూర్తిగా మారిపోయింది...
undefined
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎప్పుడూ వీలైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. విరాట్ కోహ్లీ ఇలాగే కొనసాగితే భారత జట్టుకి చాలా మంచిది...
undefined
మామూలుగా అయితే ఎవరైనా బ్యాట్స్‌మెన్ ఫామ్ కోల్పోతే జట్టు ఇబ్బందులు పడుతుంది. కానీ కెఎల్ రాహుల్ ఫామ్‌లో లేకపోవడం భారత జట్టుకి బాగా కలిసొచ్చింది...
undefined
కెఎల్ రాహుల్ సరిగా ఆడకపోవడం వల్లే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లలోని టాలెంట్ ప్రపంచానికి తెలిసింది. విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రావడంతో భవిష్యత్తులో రోహిత్ శర్మతో కోహ్లీని ఓపెనర్‌గా చూసే అవకాశం దక్కింది...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...
undefined
మొదటి మ్యాచ్‌లో 1 పరుగు చేసిన కెఎల్ రాహుల్, ఆ తర్వాతి రెండు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు. నాలుగో టీ20లో 14 పరుగులు చేసినా ఐదో టీ20లో రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతమై చేశాడు.
undefined
52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఓపెనర్‌ రోహిత్ శర్మతో కలిసి మొదటి వికెట్‌కి 94 పరుగులు జోడించాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రెండో వికెట్‌కి 49 పరుగులు, హార్ధిక్ పాండ్యాతో కలిసి మూడో వికెట్‌కి 81 పరుగులు జోడించారు...
undefined
టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా కొనసాగుతానని ప్రకటించిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో మాత్రం వన్‌డౌన్‌లోనే కొనసాగే అవకాశం ఉంది... వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌లలో ఒకరికి ఓపెనర్‌గా అవకాశం దక్కొచ్చు...
undefined
click me!