ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు... అగ్రెషన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉండే విరాట్ కోహ్లీ, ఇలా కోట్స్...

Published : Jun 15, 2023, 11:07 AM IST

విరాట్ కోహ్లీ, వరల్డ్ మోస్ట్ పాపులర్ క్రికెట్ సెలబ్రిటీ. ప్రపంచం నలుమూలలా విరాట్ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. కారణం అతని ఆట మాత్రమే కాదు, అంతకుమించిన అతని అగ్రెసివ్ యాటిట్యూడ్...

PREV
19
ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు... అగ్రెషన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉండే విరాట్ కోహ్లీ, ఇలా కోట్స్...

దూకుడైన ఆటతీరుతో ప్రపంచ దేశాల జట్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియాకి వెన్నులో వణుకు పుట్టించిన ఘనత విరాట్ కోహ్లీకే దక్కుతుంది. సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, ఎం.ఎస్. ధోనీ వంటి భారత దిగ్గజాలను ట్రోల్ చేసిన ఆస్ట్రేలియా జట్టు, విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాక టీమిండియా ప్లేయర్లను టచ్ చేయాలంటే, సెడ్జ్ చేయాలంటే భయపడడం మొదలెట్టింది...

29

ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించిన విరాట్ సేన, ఇంగ్లాండ్ టూర్‌లో ఇంగ్లాండ్‌కి చుక్కలు చూపించింది. అపారమైన అనుభవం ఉన్న ప్లేయర్లు లేకపోయినా, మ్యాచ్ విన్నర్లు అసలే కాకపోయినా దూకుడు అనే మంత్రంతో విదేశాల్లో విజయాలు అందుకున్నాడు విరాట్ కోహ్లీ...

39

ఇదే టెస్టుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్, ఆల్‌టైం గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా విరాట్ కోహ్లీని నిలబెట్టింది. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌లో కూడా చాలా తేడా వచ్చింది. ముఖ్యంగా ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత విరాట్ కోహ్లీలో మునుపటి అగ్రెషన్ కనిపించడం లేదు...

49

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ ఉన్నా, లేనట్టే అనిపించింది. ఏ బ్యాటర్ అయినా క్రీజులో నిలదొక్కుకుపోతుంటే సెడ్జ్ చేసి, ఆ ఆటగాడి ఏకాగ్రతను దెబ్బతీసి వికెట్ రాబట్టడం విరాట్ కోహ్లీ స్పెషాలిటీ. అయితే స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ భారీ భాగస్వామ్యం నిర్మించినా తనకేం సంబంధం లేనట్టుగా సైలెంట్‌గా స్లిప్‌లో ఫీల్డింగ్ చేశాడు విరాట్ కోహ్లీ...

59

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ సమయంలోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొటేషన్స్ స్టేటస్‌గా పెట్టిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు కూడా అభిమానులతో కోట్స్ షేర్ చేసుకుంటున్నాడు...
 

69
Virat Kohli Sledges Jonny Bairstow

‘మార్పును అర్థం చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం దానిలో మునిగిపోవడమే. దానితో పాటు కదలుతూ, డ్యాన్స్ చేయడమే...’ అంటూ అలెన్ వాట్స్ రాసిన ఓ కొటేషన్‌ని షేర్ చేశాడు విరాట్ కోహ్లీ...

79

ఇంతకుముందు డబ్ల్యూటీసీ ఫైనల్‌ సమయంలో ‘ఇతరుల అభిప్రాయాల జైలు నుంచి బయటపడాలంటే వాటిని పట్టించుకోకుండా స్వేచ్ఛగా ఉండడం నేర్చుకోవాలి...’ అంటూ ‘నీకు చాలా భయాలు, బాధలు, అనుమానాలు ఉంటే... ప్రేమించడానికి, జీవించడానికి ఒక్క గది కూడా ఉండదు. మనం సాధన చేసి కొన్నింటిని వదిలేయడమే మంచిది’ అంటూ కొట్స్ షేర్ చేశాడు విరాట్ కోహ్లీ...
 

89

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిన తర్వాత కూడా ‘మౌనమే, అతి గొప్ప బలానికి మూలం...’ అంటూ ఉన్న కొటేషన్ షేర్ చేశారు. ఇవన్నీ చూసి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు..
 

99

ఒకప్పుడు అగ్రెషన్‌కి, సెడ్జింగ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మోస్ట్ అగ్రెసివ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇలా కోట్స్ షేర్ చేయడం ఏంటి? అసలు విరాట్ కోహ్లీ ఎందుకు ఇలా తయారయ్యాడు? అంటూ తెగ ఫీలైపోతున్నారు.. 

Read more Photos on
click me!

Recommended Stories