ద్రావిడ్ సర్, మీ సేవలు ఇక చాలు! టీమిండియా కోచ్‌ని సాగనంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ...

Published : Jun 15, 2023, 10:08 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారీ అంచనాలతో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. అయితే ద్రావిడ్ నుంచి అభిమానులు ఆశించిన రిజల్ట్ అయితే ఇప్పటిదాకా రాలేదు...  

PREV
110
ద్రావిడ్ సర్, మీ సేవలు ఇక చాలు! టీమిండియా కోచ్‌ని సాగనంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ...
Rahul Dravid-Rohit Sharma


2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్‌ నుంచి టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్న రాహుల్ ద్రావిడ్.. ఆరంభంలో వరుస విజయాలు అందుకున్నాడు... అయితే సౌతాఫ్రికా టూర్ నుంచి సీన్ రివర్స్ అయ్యింది..

210
Rahul Dravid

సౌతాఫ్రికా టూర్‌లో తొలి టెస్టు గెలిచిన తర్వాత 2-1 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా, వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆ తర్వాత స్వదేశాల్లో వరుస విజయాలు అందుకున్నా, విదేశాల్లో, కీలక టోర్నీల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది..

310

ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 రౌండ్ నుంచే నిష్కమించిన టీమిండియా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్ నుంచి ఇంటిదారి పట్టింది. అదీకాక పసికూన బంగ్లాదేశ్‌ చేతుల్లో వన్డే సిరీస్ ఓడిపోయి, చెత్త రికార్డు మూటకట్టుకుంది..

410

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా టీమిండియాకి ఆశించిన ఫలితం దక్కలేదు. రవిశాస్త్రి కోచింగ్‌లో ఐసీసీ టోర్నీలు గెలవకపోయినా ద్వైపాక్షిక సిరీసుల్లో ఆధిక్యం చూపించి, విదేశాల్లో సంచలన విజయాలు అందుకుంది భారత జట్టు...

510

అయితే రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో టీమిండియా పర్ఫామెన్స్ దారుణంగా పడిపోయింది. ఇంతకుముందులా విదేశాల్లో ఆధిపత్యం చూపించకపోగా దూకుడుగా ఆడడం కూడా మరిచిపోయింది.. మళ్లీ స్వదేశీ పులుల్లాగే తయారైంది భారత జట్టు.. 

610

ఇంతకుముందు గ్రౌండ్‌లో ప్రత్యర్థి జట్టును భయపెట్టేలా అగ్రెషన్ చూపించే విరాట్ కోహ్లీ కూడా ద్రావిడ్ కోచింగ్‌లో సాధువులా మారిపోయి, ఇన్‌స్టాలో కోట్స్‌ పెడుతున్నాడు. మహ్మద్ సిరాజ్ అండ్ కో కూడా దూకుడు మంత్రాన్ని మరిచిపోయి, గెలవాలనే కసి కూడా చూపించడం లేదు.. 

710
KL Rahul-Dravid

అదీకాకుండా బీసీసీఐ రాజకీయాల కారణంగా 2022లో అజింకా రహానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్.. ఇలా ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చి, చెత్త రికార్డు మూటకట్టుకుంది...

810
Image credit: Getty

దీంతో రాహుల్ ద్రావిడ్‌ని సాగనంపేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు ముగియనుంది.

910
Image credit: PTI

కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత మళ్లీ కాంట్రాక్ట్‌ని పొడగించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని సమాచారం. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ గెలిస్తే రాహుల్ ద్రావిడ్ ఇంకొంత కాలం హెడ్ కోచ్‌గా కొనసాగొచ్చు...

1010

అక్కడ కూడా టీమిండియాకి ఇదే రిజల్ట్ ఎదురైతే మాత్రం వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీయే హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌కి ఆఖరి టోర్నీ అవుతుందని వార్తలు వస్తున్నాయి. టీమిండియాకి ఈసారి విదేశీ కోచ్‌ని తేవడమే బెటర్ అనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం.. 

click me!

Recommended Stories