ఆయన ముందు డబుల్ సెంచరీ చేయడమే నా కెరీర్ బెస్ట్ మూమెంట్... - విరాట్ కోహ్లీ

Published : Jul 10, 2023, 05:48 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 ముగిసిన తర్వాత నెల రోజులు బ్రేక్ తీసుకున్న టీమిండియా, వెస్టిండీస్ టూర్‌కి సిద్ధమవుతోంది. జూలై 12 నుంచి మొదటి టెస్టు ప్రారంభం కాబోతుంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు విరాట్ కోహ్లీ..  

PREV
15
ఆయన ముందు డబుల్ సెంచరీ చేయడమే నా కెరీర్ బెస్ట్ మూమెంట్... - విరాట్ కోహ్లీ

2016 పర్యటనలో వెస్టిండీస్‌లోని సర్ వీవిన్ రిచర్డ్స్ క్రికెట్ స్టేడియంలో టెస్టుల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ సాధించాడు విరాట్ కోహ్లీ. ఇదే మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులు చేసి, మొట్టమొదటి విదేశీ టెస్టు సెంచరీ సాధించాడు. 
 

25

శిఖర్ ధావన్ 84, అమిత్ మిశ్రా 53, వృద్దిమాన్ సాహా 40 పరుగుల ఇన్నింగ్స్‌ల కారణంగా టీమిండియా 2 రోజులు బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 566 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.. తొలి ఇన్నింగ్స్‌లో 243, రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులు చేసి భారత జట్టు చేతుల్లో ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఓడింది విండీస్...

35

‘వెస్టిండీస్‌లో నా ఫెవరెట్ మెమొరీ అంటే అంటీగాలోనే!  సర్ వీవ్ రిచర్డ్స్ ముందు టెస్టుల్లో నా మొట్టమొదటి డబుల్ సెంచరీ సాధించాను. అది నా కెరీర్‌లోనే చాలా చాలా స్పెషల్ మూమెంట్...

45

ఆ రోజు సాయంత్రం నన్ను కలిసి ఆయన కంగ్రాట్స్ చెప్పారు. చాలాసేపు నాతో మాట్లాడారు. అంతకంటే గొప్ప విషయం ఇంకేమీ ఉంటుంది. ఆయన నా చిన్ననాటి హీరో. రిచర్డ్స్‌ మాట్లాడిన ప్రతీ మాట, నాకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ..

55
Image credit: PTI

2016లో మొట్టమొదటి టెస్టు డబుల్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ, అదే ఏడాది 3 డబుల్ సెంచరీలు చేశాడు. ఆ తర్వాతి ఏడాది 2017లో మరో 3 డబుల్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, 2019లో ఏడో డబుల్ సెంచరీ బాది.. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు..
 

Read more Photos on
click me!

Recommended Stories