ట్యాక్స్ లో టాప్.. విరాట్ కోహ్లీ ఆదాయం ఎంతో తెలుసా?

First Published | Sep 6, 2024, 4:28 PM IST

Virat Kohli paid the highest tax : ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. అలాగే, గ్రౌండ్ వెలుప‌ల సంపాద‌న‌లోనూ చ‌రిత్ర సృష్టిస్తున్నాడు. కోహ్లీ అత్యధిక పన్ను చెల్లించిన క్రీడాకారుల జాబితాలో ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్‌లను అధిగ‌మించాడు.
 

Virat Kohli paid the highest tax : భార‌త దిగ్గ‌జ స్టార్ ప్లేయ‌ర్ల‌లో విరాట్ కోహ్లీ ఒక‌రు. ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో టాప్ క్రికెట‌ర్ గా కొన‌సాగుతున్నాడు. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్ లో అనేక రికార్డులు సృష్టించాడు. భార‌త్ కు ఒంటిచేత్తో అనేక అద్భుత విజ‌యాలు అందించాడు. 

విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ప‌రుగులు వ‌ర‌ద పారించ‌డంలో పాటు గ్రౌండ్ వెలుప‌ల త‌న ఫేమ్, సంపాద‌న‌లోనూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవ‌లే బీబీసీ ర్యాంకింగ్ రిపోర్టు ప్ర‌కారం.. ప్ర‌పంచంలో అత్య‌ధికంగా ఆరాధించే ఆట‌గాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 6వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టు టాప్-10 లో చోటుద‌క్కించుకున్న ఒకే ఒక్క క్రికెట‌ర్ కింగ్ కోహ్లీ. 

ఇప్ప‌టికే లెజెండ‌రీ ప్లేయ‌ర్లు స‌చిన్ టెండూల్క‌ర్, ఎంఎస్ ధోనీల అనేక క్రికెట్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు సంపాద‌న‌లోనూ ఈ ప్లేయ‌ర్ల‌ను అధిగ‌మించాడు. విరాట్ కోహ్లీ క్రికెట్ కు కాస్త విరామం ప్ర‌క‌టించి ప్రస్తుతం  తన కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. 

సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్ట‌నున్నాడు. లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్నప్పటికీ అత‌ని గురించిన విష‌యాలు ఎప్పుడూ వైర‌ల్ అవుతూనే ఉంటాయి. క్రికెట్ ల‌వ‌ర్స్ కూడా విరాట్ గురించి ప్ర‌తి విష‌యాన్ని తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. 

Latest Videos


ఇదే క్ర‌మంలో ఒక ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. విరాట్ కోహ్లీ భార‌త లెజెండ‌రీ ప్లేయ‌ర్ల‌ను అధిగమిస్తూ సంపాద‌న‌లోనూ దూసుకుపోతున్నాడు. ఫార్చ్యూన్ ఇండియా ఒక నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 66 కోట్ల పన్ను చెల్లించాడు.

అంటే భార‌త క్రీడాకారుల‌లో అత్య‌ధిక టాక్స్ చెల్లించిన ప్లేయ‌ర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత మాజీ ఆటగాళ్లు ఎంఎస్ ధోని (రూ. 38 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ. 28 కోట్లు) ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

ఆ త‌ర్వాత సౌరవ్ గంగూలీ (రూ. 23 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ. 13 కోట్లు) మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. కోహ్లి చివరిసారిగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు కానీ బ్యాటింగ్ చార్ట్‌లలో అగ్రగామిగా ఉండటంలో విఫలమయ్యాడు. 

2024లో బార్బడోస్‌లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో వ‌రుసగా నిరాశ‌ప‌రిచిన విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. భార‌త్ టీ20 ప్ర‌పంచ క‌ప్ గెలిచిన త‌ర్వాత కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాలు టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. 

విరాట్ కోహ్లీ ఆదాయం ఎంత‌? 

ప‌లు మీడియా నివేదిక‌ల ప్రకారం 2024 నాటికి, విరాట్ కోహ్లీ నికర విలువ ₹ 1,000 కోట్లకు పైగా ఉంది. బీసీసీఐతో ఒప్పందం, ఐపీఎల్ లో ఆర్సీబీతో ఒప్పందాల నుంచి కోహ్లీకి ఆదాయ అందుతోంది. అలాగే, ప‌లు టాప్ కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు.

ప్యూమా, ఆడి, ఎంఆర్ఎఫ్ వంటి ప్రముఖ ప్రపంచ బ్రాండ్‌లతో కూడిన ఎండార్స్‌మెంట్‌ల ద్వారా విరాట్ కోహ్లికి భారీగా ఆదాయం వ‌స్తుంది. అలాగే, 'వన్8'తో సహా పలు వ్యాపార సంస్థలలో కూడా కోహ్లీకి వాటాలు ఉన్నాయి.

click me!