అప్పుడు కెప్టెన్‌గా, ఇప్పుడు హెడ్‌కోచ్‌గా... రాహుల్ ద్రావిడ్‌ ముందు అసలైన ఛాలెంజ్...

First Published Dec 9, 2021, 1:14 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత భారత జట్టులో జరుగుతున్న పరిణామాలు, యావత్ క్రీడాలోకాన్ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీని, వన్డే కెప్టెన్‌గానూ తొలగిస్తూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం... భారత జట్టులో చీలికలు తెస్తుందని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి...

టీమిండియా సారథిగా విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. విరాట్ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లలోనూ ఇంతకుముందు కెప్టెన్ల కంటే మెరుగ్గా విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది భారత జట్టు...

అలాంటి విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం... భారత జట్టులో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో అంచనా వేయడం అసాధ్యం...

అయితే ఈ పరిణామాలు, టీమిండియాకి కొత్తేమీ కాదు. ఇంతకుముందు గ్రెగ్ ఛాపెల్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సౌరవ్ గంగూలీని కెప్టెన్‌గా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది టీమ్ మేనేజ్‌మెంట్...

గంగూలీకి కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డు ఉన్నా, బ్యాట్స్‌మెన్‌గా వరుసగా ఫెయిల్ అవుతుండడంతో అప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది...

అప్పుడు సౌరవ్ గంగూలీని కెప్టెన్‌గా తొలగించిన తర్వాత, భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సారథిగా ఆదుకున్నాడు రాహుల్ ద్రావిడ్... ఇప్పుడు భారత జట్టును ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి కాపాడాల్సిన బాధ్యత కూడా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పైనే ఉంది... 

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇంతకుముందులా పరుగుల వరద పారించలేకపోతున్నాడు. అయితే కోహ్లీ బ్యాటు నుంచి పరుగులు రావడం మాత్రం ఆగిపోలేదు. ఇప్పటికే విరాట్ బ్యాటింగ్ యావరేజ్ 50+ పైనే ఉంది.

అలాంటి కోహ్లీని బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం జట్టుకి ఏ మాత్రం మంచిది కాదు. ఈ అవమానాన్ని విరాట్ ఎలా స్వీకరిస్తాడనేది చాలా కీలకం...

బ్యాట్స్‌మెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నా, విజయాన్ని అందించే ప్లేయర్లతో జట్టును నిర్మించలేకపోయిన సచిన్ టెండూల్కర్... కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు...

సచిన్ టెండూల్కర్‌తో పోలిస్తే, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. నెం.7 స్థానంలో ఉన్న భారత టెస్టు టీమ్‌ను నెం.1గా నిలపగలిగాడు...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు రిజర్వు బెంచ్ ఇంతకుముందెప్పుడూ లేనంత పటిష్టంగా తయారైంది. ఒకే సమయంలో రెండు వేర్వేరు జట్లతో రెండు సిరీస్‌లు ఆడిందంటే టీమిండియా... స్టామీనా ఏంటో అర్థం చేసుకోవచ్చు...

రోహిత్ శర్మ వయసు ఇప్పటికే 34 ఏళ్లు. విరాట్ కోహ్లీ కంటే ముందే రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టాప్ పర్ఫామర్‌గా నిలిచిన రోహిత్ శర్మ, కెప్టెన్‌గా సక్సెస్ అవుతాడా?

ఒకవేళ భారత జట్టు, న్యూజిలాండ్ టూర్‌లో వన్డే సిరీస్ గెలవలేకపోయినా, లేదా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, విరాట్‌లా పరుగుల ప్రవాహం పారించలేకపోయినా... ఫ్యాన్స్ నుంచి బీభత్సమైన ట్రోలింగ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే...

కోహ్లీ లేకుండా ఆడిన కాన్పూర్ టెస్టులో భారత జట్టు ఆటతీరు, విరాట్ ఎంట్రీ తర్వాత ముంబై టెస్టులో టీమిండియా టాప్ క్లాస్ పర్పామెన్స్ చూస్తే... జట్టుపై అతని ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు...

click me!