ఫైనల్ మ్యాచ్,లో ఓడినా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా అద్భుతంగా రాణించిందని... భారత జట్టు ఫైనల్‌కి చేరుకోవడానికి కూడా అతనే కారణమనే విషయాన్ని గుర్తించుకోవాలని అంటున్నాడు పాక్ మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్...
‘విరాట్ కోహ్లీ ఓ సూపర్ బ్యాట్స్‌మెన్. అద్భుతమైన కెప్టెన్ కూడా... కాకపోతే అతనికి అదృష్టం కలిసి రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో కెప్టెన్, టీమిండియాను విజయతీరాలకు చేర్చలేడు...
భారత జట్టు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో అద్భుతాలు చేసింది. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీ జట్టును స్టార్ పర్ఫామర్‌గా చేశారు...
ప్రతీ ఒక్కరూ విరాట్ కోహ్లీ, ఐసీసీ టైటిల్ గెలవలేదని కామెంట్ చేస్తున్నారు, కానీ జట్టు విజయం కోసం తానేం చేయగలడో అంతా చేస్తున్నాడు కోహ్లీ. అతని కెప్టెన్సీలో టీమిండియా అనేక విజయాలు సాధించింది...
అతని కెప్టెన్సీపై నాకు ఎలాంటి అనుమానాలు లేవు. కోహ్లీకి కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలంతే... ఇప్పుడు టీమిండియా ఐసీసీ టైటిల్స్ గెలవడం లేదంటే అది కేవలం అతని తప్పు మాత్రమే కాదు...
జట్టుగా ఐసీసీ ఫైనల్స్‌లో ఎందుకు విజయం అందుకోలేకపోతున్నారో ఆలోచించాలి. ఫైనల్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల అక్కడి దాకా చేరుకోవడానికి చేసినదంతా వృథా అయిపోతోంది...
విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించి, మరో ప్లేయర్‌కి ఆ బాధ్యతలు అప్పగిస్తే టీమిండియా విజయాలు సాధించగలదా? అలాంటి సత్తా ఉన్న ప్లేయర్ ఎవరున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్...