విరాట్ కోహ్లీ వార్డ్‌రోబ్‌లో అన్నీ ఖరీదైన రోలెక్స్ వాచీలే ఉంటాయట. వెస్టిండీస్ టూర్‌లో విరాట్ కోహ్లీ, చేతికి రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఎవరోస్ గోల్డ్ వాచీతో కనిపించాడు. దీని ఖరీదు దాదాపు 88 లక్షల రూపాయలు..
దీంతో పాటు రోలెక్స్ డేట్‌జస్ట్ 41 వాచీ కూడా విరాట్ కోహ్లీ దగ్గర ఉంది. 18 క్యారెట్స్ గోల్డ్, డైమండ్స్‌తో తయారుచేసిన ఈ వాచీ ఖరీదు దాదాపు రూ.9 లక్షల రూపాయలు..
Virat Kohli
అంతేకాదు విరాట్ కోహ్లీకి వాచీలను గిఫ్ట్‌లుగా ఇవ్వడం బాగా అలవాటు. శుబ్‌మన్ గిల్, ఏబీ డివిల్లియర్స్, ఫాఫ్ డుప్లిసిస్ వంటి వాళ్లకు విరాట్ కోహ్లీ... వాచీలను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
అలాగే ఏ క్రికెటర్ అయినా వాచీ వేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ఆ వాచీ గురించి ఆరా తీయడం.. దాన్ని వెంటనే కొనుగోలు చేయడం కూడా విరాట్ కోహ్లీకి బాగా అలవాటు..
అయితే టీమిండియాలో అత్యంత ఖరీదైన వాచీ ఉన్నది మాత్రం హార్ధిక్ పాండ్యా దగ్గర. హార్ధిక్ పాండ్యా చేతికి ఉండే పటెక్ ఫిలిప్పీ రిస్ట్ వాచీ కరీదు దాదాపు రూ.5 కోట్లు. ఇందులో 32 ఖరీదైన వజ్రాలు పొదగబడి ఉంటాయి..
Hardik Pandya
ఐపీఎల్ 2021 సమయంలో హార్ధిక్ పాండ్యా, దుబాయ్ విమానాశ్రయంలో ఖరీదైన వాచీలతో దొరికినట్టు వార్తలు వచ్చాయి. తన కుటుంబం కోసం కొన్న రెండు వాచీలకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించకపోవడంతో అతన్ని విమానాశ్రయంలో అడ్డుకున్నారు అధికారులు. ఈ వాచీల ఖరీదు రూ.1.5 కోట్లకు పైనే ఉంటుందట..