కోహ్లీ! నీ గర్వం తగ్గించుకో! పొడిగితే ఓకే, తిడితే ఇలా అంటారా!... సంజయ్ మంజ్రేకర్ కామెంట్...

First Published Mar 23, 2021, 3:51 PM IST

భారత జట్టు సెలక్షన్‌పై, కెఎల్ రాహుల్ ఫామ్‌పై వస్తున్న విమర్శలపై విరాట్ కోహ్లీ ‘నాన్‌సెన్స్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...

టీ20 వరల్డ్‌కప్‌కి ముందు భారత జట్టు టీమ్ కాంబినేషన్ విషయంలో అనేక ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌, రాహుల్ చాహార్ వంటి యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది టీమిండియా..
undefined
అలాగే బ్యాటింగ్ ఆర్డర్ విషయంలోనూ అనేక ప్రయోగాలు జరిగాయి. రెండో టీ20లో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రాగా, నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్ వన్‌డౌన్‌లో రాగా, వన్‌డౌన్‌లో వచ్చే విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు...
undefined
ఐదో టీ20లో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ రాగా, నాలుగో స్థానంలో హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్‌కి వచ్చాడు. ఓ మ్యాచ్‌లో రిషబ్ పంత్, ఓ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చారు...
undefined
ఇలా ఇష్టం వచ్చినట్టుగా బ్యాటింగ్ ఆర్డర్‌ మార్చడంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వరుసగా ఫెయిల్ అవుతున్నప్పుడు కెఎల్ రాహుల్‌ని కొనసాగించడంపై విమర్శించిన నెటిజన్లు, అతన్ని పక్కనబెట్టగానే టీ20 బెస్ట్ బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వరా అని విమర్శించారు...
undefined
‘జట్టులో జరిగే మార్పులు, ఓ మంచి ప్రయోజనం ఆశించి జరుగుతాయి. వాటి గురించి బయటివాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారనేది నా దృష్టిలో అనవసరం...
undefined
క్రికెటర్ ఎవ్వరైనా ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతుంటే, ఇలాంటి విమర్శలతో అతన్ని మానసికంగా మరింత దిగజార్చుతాయి ఇలాంటి విమర్శలు... ఇలాంటి చర్చంతా నా దృష్టిలో నాన్‌సెన్స్...
undefined
ఫామ్‌లో లేని బ్యాట్స్‌మెన్‌తో ఎలా వ్యవహారించాలి, అతని కెరీర్‌ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో టీమ్ మేనేజ్‌మెంట్‌కి బాగా తెలుసు’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
undefined
‘బయటి చర్చ మొత్తం విరాట్ కోహ్లీ నాన్‌సెన్స్ అంటున్నాడు. ప్రజల మధ్య జరిగే పర్ఫామెన్స్ గురించి ప్రజలు మాట్లాడకూడదా? నువ్వు బాగా ఆడినప్పుడు నిన్ను పొగుడుతూ ప్రోత్సాహించిదే కూడా వీళ్లే...
undefined
బాగా ఆడినప్పుడు పొగడ్తలు కావాలంటే, ఆడనప్పుడు విమర్శలు, తిట్లు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి... ఈ వయసులో వాస్తవానికి దగ్గరగా ప్రశాంతంగా ఉండడం నేర్చుకో...
undefined
ఎన్ని విమర్శలు వచ్చినా మహేంద్ర సింగ్ ధోనీ ఎంత కూల్‌గా, మెచ్యూర్డ్‌గా ఆలోచించేవాడో ఓసారి గుర్తుకు తెచ్చుకో’ అంటూ కామెంట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్...
undefined
రవీంద్ర జడేజా గురించి ‘బటర్ అండ్ పీస్ ప్లేయర్’ అంటూ సంజయ్ మంజ్రేకర్ చేసిన కామెంట్లు తీవ్రదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగానే అతన్ని బీసీసీఐ, కామెంటరీ ప్యానెల్ నుంచి బహిష్కరించింది.
undefined
click me!