సచిన్, సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన ధావన్, రోహిత్... తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...

First Published Mar 23, 2021, 3:15 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా, 64 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 42 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్ వేసిన రెండో ఓవర్‌లో కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన టీమిండియాకి రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కలిసి శుభారాంభం అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలర్లు చేయడంతో ధాటిగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు ఇద్దరు ఓపెనర్లు...
undefined
మార్క్ వుడ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ మోచేతికి గాయమైంది. ఫిజియో చికిత్స తర్వాత తిరిగి బ్యాటింగ్ కొనసాగించిన రోహిత్ శర్మ, మార్క్ వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో ఆఖరి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదాడు...
undefined
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కలిసి మొదటి వికెట్‌కి 64 పరుగులు జోడించారు. ఈ ఇద్దరికీ ఇది వన్డేల్లో 31వ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం. వన్డేల్లో అత్యధికసార్లు 50+భాగస్వామ్యం నెలకొల్పిన రెండో ఓపెనింగ్ జోడిగా నిలిచారు ధావన్, రోహిత్...
undefined
సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ 44 సార్లు మొదటి వికెట్‌కి 50+ భాగస్వామ్యాలు నెలకొల్పగా, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి 30 సార్లు ఈ ఫీట్ సాధించారు. సచిన్, సెహ్వాగ్ రికార్డును అధిగమించాన ధావన్, రోహిత్ రెండో స్థానంలో నిలిచారు...
undefined
2015 జనవరి నుంచి ఓపెనర్‌గా 5300+ పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. రోహిత్ సగటు 62 పైనే ఉండగా, శిఖర్ ధావన్ 3700+ పరుగులతో టాప్ 5లో ఉన్నాడు...
undefined
బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఆడిన ఆఖరి ఏడు బంతుల్లో మూడు సార్లు అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ... టెస్టు మ్యాచ్‌లో, ఆఖరి టీ20లో బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అవుటైన రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో అతని బౌలింగ్‌లో ఎదుర్కొన్న రెండో బంతికే అవుట్ అయ్యాడు.
undefined
20.3 ఓవర్లు ముగిసేసరికి రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన టీమిండియా 88 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 43 పరుగులు, విరాట్ కోహ్లీ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
undefined
click me!