టెస్టు క్రికెట్ రాతను మార్చింది విరాట్ కోహ్లీయే! అతని కెప్టెన్సీలో టీమిండియా... గ్రేమ్ స్మిత్ కామెంట్...

First Published Aug 20, 2022, 2:21 PM IST

కొన్నాళ్ల కిందటి వరకూ టెస్టుల మనుగడపై చాలా పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు వన్డే క్రికెట్‌కి ఆదరణ తగ్గుతోందని, త్వరలోనే 50 ఓవర్ల ఫార్మాట్‌‌కి ముగింపు పలకాల్సిన సమయం వస్తుందని అంటున్న క్రికెట్ విశ్లేషకులు, కొన్నేళ్ల క్రిందట సంప్రదాయ క్రికెట్‌కి ఆదరణ దక్కడం లేదని వాపోయారు. ఈ పరిస్థితిని దూరం చేసింది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియానే అంటున్నాడు సౌతాఫ్రికా లెజెండరీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్...

‘టెస్టు క్రికెట్‌కి కాపాడే బాధ్యత కొన్ని ఐకానిక్ దేశాలపైనే ఉంది. ఎందుకంటే చిన్నచిన్న దేశాలు టెస్టు ఫార్మాట్‌ను ఆడలేవు, కాపాడలేవు. అది వారి శక్తికి మించిన పని. టెస్టు క్రికెట్‌కి మునుపటి వైభవం తీసుకొచ్చిన దేశాల్లో టీమిండియాకి కచ్ఛితంగా ప్లేస్ ఉంటుంది...

ముఖ్యంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు టెస్టు క్రికెట్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. విరాట్ జట్టును నడిపించిన విధానం అద్భుతం. విరాట్ అండ్ టీమ్ వల్లే టెస్టులకు ఇప్పుడు ఇంతటి ఆదరణ దక్కుతోంది.. టెస్టుల్లో 10-14 పటిష్టమైన జట్లు దొరకడం సాధ్యం కాదు. ఉన్న నాలుగైదు జట్లతోనే మంచి క్రికెట్ ఆడగలగాలి...

టెస్టు క్రికెట్‌కి మరింత ఆదరణ పెరగాలంటే టెస్టులు ఆడే దేశాల సంఖ్య ఐదు లేదా ఆరుకి తగ్గిస్తే చాలా మంచిది...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్. టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ (53 విజయాలు) టాప్‌లో ఉంటే, విరాట్ కోహ్లీ (40 విజయాలు) నాలుగో స్థానంలో ఉన్నాడు...

సౌతాఫ్రికా త్వరలో ఆరంభించబోతున్న టీ20 లీగ్‌కి గ్రేమ్ స్మిత్, కమిషనర్‌గా నియమించబడ్డాడు. ‘సౌతాఫ్రికాని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఈ లీగ్ మాకు ఎంతో కీలకంగా మారిపోయింది. 

అందుకే ఏడాదిలో కనీసం ఓ నాలుగు వారాలు, ఈ టీ20 లీగ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నాం... ’ అంటూ కామెంట్ చేశాడు గ్రేమ్ స్మిత్... సౌతాఫ్రికా టీ20 లీగ్ కోసం ఆస్ట్రేలియాతో ఆడాల్సిన సిరీస్‌లను కూడా రద్దు చేసుకుంది సౌతాఫ్రికా. 

click me!