గంగూలీ‌కి అక్కడ తగిలేలా బౌలింగ్ చేయమన్నారు... షాకింగ్ విషయం బయటపెట్టిన షోయబ్ అక్తర్...

First Published Aug 20, 2022, 1:12 PM IST

షోయబ్ అక్తర్... 150-160+ వేగంతో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్. అయితే అక్తర్ వికెట్ల కంటే ఎక్కువగా బ్యాటర్ల బాడీ మీదే ఎక్కువ టార్గెట్ చేసేవాడు. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ చాలాసార్లు నిర్మొహమాటంగా ఒప్పుకున్నాడు కూడా. 1999 మొహాలీ వన్డే మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీని గాయపరిచాడు షోయబ్ అక్తర్...

ఆసియా కప్ 2022 టోర్నీ ఆగస్టు28 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్, దాయాది పాకిస్తాన్‌తో తలబడనుంది. ఈ మ్యాచ్‌కి హైప్ తెచ్చేందుకు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ షోయబ్ అక్తర్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో ఓ ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్తర్, కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు...

‘సౌరవ్ గంగూలీని రిబ్స్‌ మీద టార్గెట్ చేయాలనేది టీమ్ మీటింగ్‌లోనే డిసైడ్ అయ్యింది. బ్యాటర్లను ఎలా గాయపరచాలి? ఎక్కడెక్కడ బాల్ తగలాలి? అనేది టీమ్ మీటింగ్‌లో చర్చకు వచ్చేది... నేను ‘గంగూలీని అవుట్ చేయాలా?’ అని అడిగాను...

‘వద్దు, నీ బౌలింగ్‌లో చాలా పేస్ ఉంది. నువ్వు బ్యాటర్ల బాడీకి తగిలేలా బౌలింగ్ చెయ్యి, వికెట్లు వేరే వాళ్లు తీసుకుంటారు...’ అంటూ కెప్టెన్ అండ్ కో చెప్పారు. నేను కూడా అదే చేసేవాడిని... అనుకున్నట్టే నేను వేసిన బాల్, గంగూలీ రిబ్స్ మీద బలంగా తగిలింది...’ అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్...

షోయబ్ అక్తర్ వేసిన 150+ బాల్ బలంగా గంగూలీ రిబ్స్ మీద తగిలింది. దీంతో క్రీజులో నొప్పితో విలవిలలాడి డగౌట్‌కి చేరిన సౌరవ్ గంగూలీ, కొద్దిసేపటి తర్వాత తిరిగి బ్యాటింగ్‌కి 57 పరుగులు చేశాడు.. 

click me!