ఎన్‌సీఏ గడప తొక్కని విరాట్ కోహ్లీ... టీమిండియాలో ఒకే ఒక్కడు! పంత్, రాహుల్, రోహిత్‌లకు...

First Published | Oct 15, 2022, 6:39 PM IST

భారత క్రికెట్ జట్టులోనే కాదు, వరల్డ్ క్రికెట్‌లో ఫిట్టెస్ట్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. తన 14 ఏళ్ల కెరీర్‌లో విరాట్ కోహ్లీ గాయాల కారణంగా తప్పుకున్న మ్యాచులు నాలుగంటే నాలుగు. తాజాగా విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

భారత జట్టులో గాయపడిన క్రికెటర్లు, బెంగళూరులోని ఎన్‌సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ)లో శిక్షణ తీసుకుని, ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది... ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేస్తేనే మళ్లీ భారత జట్టు తరుపున ఆడేందుకు అనుమతిస్తారు..

తాజాగా గత సీజన్‌లో ఎన్‌సీఏలో రిహాబ్‌నేషన్ తీసుకున్న ప్లేయర్ల లిస్టును విడుదల చేసింది బీసీసీఐ.  ఎన్‌సీఏలోనే రిహాబిటేషన్‌ తీసుకున్న భారత సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్లతో పాటు ఇండియా ఏ, ఇండియా అండర్ 19, వుమెన్స్ టీమ్, స్టేట్ ప్లేయర్లను జాబితాను విడుదల చేసింది భారత క్రికెట్ బోర్డు...


భారత జట్టు తరుపున శ్రేయాస్ అయ్యర్, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, శిఖర్ ధావన్, అశ్విన్, దీపక్ చాహార్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, ఉమేశ్ యాదవ్, వృద్ధిమాన్ సాహా... ఇలా సీనియర్లు,జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ ఎన్‌సీఏలో చికిత్స తీసుకున్న లిస్టులో ఉన్నారు. ఈ లిస్టులో లేని ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ...

గత ఏడాది కాలంలో విరాట్ కోహ్లీ ఎన్‌సీఏకి వెళ్లి, రిహాబిటేషన్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇండియా ఏ తరుపున ఆడే టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, సందీప్ వారియర్, రాహుల్ చాహార్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, మనీశ్ పాండే, నవ్‌దీప్ సైనీ, ప్రియాంక్ పంచల్, శుబ్‌మన్ గిల్, ఖలీల్ అహ్మద్, అర్ష్‌దీప్ సింగ్, దేవ్‌దత్ పడిక్కల్, ఇషాన్ పోరెల్, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా, నితీశ్ రాణా, పృథ్వీ షా, సిమర్‌జీత్ సింగ్, కెఎస్ భరత్, వరుణ్ అరోన్, వెంకటేశ్ అయ్యర్ కూడా ఎన్‌సీఏలో చికిత్స తీసుకున్నారు...

jhulan

భారత వుమెన్స్ టీమ్ తరుపున దీప్తి శర్మ, ప్రియా పూనియా, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్.. ఎన్‌సీఏలో శిక్షణ పొందగా కమ్లేశ్ నాగర్‌కోటి, కృష్ణప్ప గౌతమ్, కార్తీక్ త్యాగి వంటి స్టేట్ ప్లేయర్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కుర్రాళ్లు కూడా గాయాలతో సతమతమవుతూ ఎన్‌సీఏ చెంతకు చేరుతుంటే, 33 ఏళ్ల విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తున్న విధానం క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

kohli injury

విరాట్ కోహ్లీ క్రీజులో ఆడుతూ గాయపడిన సందర్భాలు కోకొల్లలు. ఓ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోబోయిన బంతి, మిస్ అయ్యి అతని ముఖానికి గట్టిగా తగిలింది. ఆ సమయంలోనూ విరాట్ ఆటను కొనసాగించాడు. విరాట్‌ను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ఫిట్‌నెస్‌ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుంటే... ఒకే ఏడాది 8 మంది కెప్టెన్లను మార్చాల్సిన అవసరం టీమిండియాకి వచ్చేది కాదని అంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్.. 

Latest Videos

click me!