ఫైనల్‌లో కోహ్లీ అలా ప్రవర్తించడానికి కారణం ఇదే... న్యూజిలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో క్రికెట్ ఫ్యాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది విరాట్ కోహ్లీ ఎక్స్‌ప్రెషన్, అగ్రెసివ్ యాటిట్యూడ్. వికెట్ పడిన ప్రతీసారీ ఎంతో అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతూ కనిపించాడు విరాట్ కోహ్లీ. దీని వెనక ఓ కారణం ఉందంటున్నాడు న్యూజిలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్. 

తొలి ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్ వికెట్ పడిన తర్వాత టీమిండియా జెర్సీని ముద్దాడుతూ కనిపించిన విరాట్ కోహ్లీ... న్యూజిలాండ్‌ అభిమానుల వైపు చూస్తూ ‘ష్...’ అంటూ నోటిపైన వేలి వేస్తూ హెచ్చరించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
ఇంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో, ఇంగ్లాండ్ పర్యటనలో ఇలాంటి చర్యలతో హాట్ టాపిక్ అయిన విరాట్ కోహ్లీ, ఫైనల్‌లో న్యూజిలాండ్ ఫ్యాన్స్‌తో ఇలా నడుచుకున్నాడు...

‘అవును.. స్టేడియంలో ఉన్న న్యూజిలాండ్ సపోర్టర్స్, ఫ్యాన్స్ జాంబీ పాటను పాడుతూ కోహ్లీని హేళన చేసేందుకు ప్రయత్నించారు... ఇన్ యువర్ హెడ్ కోహ్లీ, ఇన్ యువర్ హెడ్ కోహ్లీ... కోహ్లీ అంటూ అతన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు...
అయితే విరాట్ కోహ్లీ, వారికి ప్రతీసారి గట్టి రిప్లై ఇచ్చాడు. ‘ష్...’ అంటూ ఫింగర్ చూపిస్తూ హెచ్చరిస్తూ, భయపెట్టాడు. డివాన్ కాన్వే బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఆ పాట పాడుతూనే ఉన్నారు ఫ్యాన్స్...
అందుకే అతను అవుటైన తర్వాత విరాట్ కోహ్లీ... తన అగ్రెసివ్ యాటిట్యూడ్‌ని చూపించాడు. అయితే ఆ పాట మాకు బాగా ఎక్కేసింది... ఫైనల్ మ్యాచ్‌లో విజయం తర్వాత ఆ పాట పాడుతూనే ఉన్నాం...
డ్రెస్సింగ్ రూమ్‌లో, ప్లైయిన్‌లో కూడా సడెన్‌గా ఆ పాట పాడుకున్నాం... టిమ్ సౌథీ తన ఫోన్‌ తీసి ఈ పాటను పెట్టాడు... అంతే మేమంతా నవ్వుతూ, కోరస్ పాడడం మొదలెట్టాం..’ అంటూ చెప్పుకొచ్చాడు నీల్ వాగ్నర్...
తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన రెండు వికెట్లు తీసి భారత జట్టును దెబ్బతీసిన నీల్ వాగ్నర్, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ సాధించాడు...
తన కెరీర్‌లో ఒక్క వన్డే, టీ20 మ్యాచ్ కూడా ఆడలేకపోయిన నీల్ వాగ్నర్, డబ్ల్యూటీసీ ఫైనల్ విజయం తన క్రికెట్ జీవితంలో బెస్ట్ మూమెంట్ అంటూ అభివర్ణించాడు..

Latest Videos

click me!