తొలి టెస్టులో టీమిండియా ‘అతి జాగ్రత్త’... రికార్డుల కోసమే ఆడుతున్నట్టు, పరమ జిడ్డు బ్యాటింగ్..

Published : Jul 14, 2023, 04:18 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా చిత్తుగా ఓడింది. గత 10 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఫెయిల్ అవ్వడం, విమర్శలు రావడం జరుగుతూనే ఉంది. ఈసారి విమర్శల డోస్ కాస్త ఎక్కువగా ఉంది...

PREV
18
తొలి టెస్టులో టీమిండియా ‘అతి జాగ్రత్త’... రికార్డుల కోసమే ఆడుతున్నట్టు, పరమ జిడ్డు బ్యాటింగ్..


ఐసీసీ టోర్నీలో మనోళ్లు కచ్ఛితంగా ఫెయిల్ అవుతారని ఊహించి, ఆ తర్వాత ఓ వీక్ టీమ్‌తో సిరీస్‌ ఏర్పాటు చేస్తుంటుంది బీసీసీఐ. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఉపఖండ పిచ్‌ల మీద అట్టర్ ప్లాప్ అయ్యే న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడిన టీమిండియా, 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత కూడా అదే న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్‌ ఆడింది...

28
Kohli

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘాన్‌తో సిరీస్ ఆడాల్సింది. అయితే మరీ ఆఫ్ఘాన్‌తో సిరీస్ అంటే ట్రోల్స్ మరీ ఎక్కువ వస్తాయని అనుకున్నారో లేక అబ్బో... రెండు నెలలు ఐపీఎల్ ఆడి మనోళ్లు అలసిపోయారు కాస్త రెస్ట్ ఇద్దామని భావించారో కానీ.. ఆ సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది..

38
Rohit Sharma

నెల రోజుల బ్రేక్ తర్వాత వెస్టిండీస్‌లో అడుగుపెట్టిన భారత జట్టు, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఫెయిల్ అయినందుకు వచ్చిన విమర్శలకు అదిరిపోయే పర్ఫామెన్స్‌లతో సమాధానం చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. అసలే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేక కుమిళిపోతున్న విండీస్‌పై ప్రతాపం చూపిస్తోంది..
 

48

నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి చిన్న టీమ్స్ కూడా ఓ ఆటాడుకున్న వెస్టిండీస్ బౌలింగ్‌‌ని ఎదుర్కోవడానికి మనోళ్లు పడుతున్న ఇబ్బంది చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఫేస్ చేసినప్పుడు కూడా టీమిండియా బ్యాటింగ్‌లో ఇంత అతి జాగ్రత్త కనిపించలేదు..

58
Rohit Sharma

రోహిత్ శర్మ సెంచరీ అందుకోవడానికి 220 బంతులను ఎదుర్కొన్నాడు. తన టెస్టు కెరీర్‌లో అత్యంత నిదానంగా వచ్చిన సెంచరీ ఇదే. తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ, తన క్లాస్ బ్యాటింగ్ చూపించాలని తపన పడుతున్నాడంటే అనుకోవచ్చు.. కానీ విరాట్ కోహ్లీ కూడా జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించాడు..
 

68
Yashasvi Jaiswal

మొదటి బంతికి ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న విరాట్ కోహ్లీ, 96 బంతులు ఆడి కొట్టింది ఒకే ఒక్క బౌండరీ. అది కూడా 81 బంతులు ఆడిన తర్వాత వచ్చింది. కోహ్లీ ఇంత జాగ్రత్తగా ఆడడం ఎప్పుడూ చూడలేదు.. ఆఖరికి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా కోహ్లీ ఇలా ఆడలేదు..

78

రోహిత్ సెంచరీ చేసుకున్నాడు, యశస్వి జైస్వాల్ సెంచరీ బాదాడు. శుబ్‌మన్ గిల్ త్వరగా అవుట్ అయినా విరాట్ కోహ్లీ కూడా ఎలాగైనా సెంచరీ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయి వచ్చినట్టు కనిపిస్తోంది. సునీల్ గవాస్కర్ అన్నట్టుగా వెస్టిండీస్‌తో సిరీస్, మనోళ్ల రికార్డులు మెరుగుపర్చుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరానట్టుగానే ఉంది.. 

88

పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తున్నా, బౌన్సర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నా ఇలాంటి ఛాలెంజింగ్ పిచ్‌లు మనోళ్లకు కొత్తేమీ కాదు....  ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వరల్డ్ క్లాస్ బౌలర్లను, అక్కడి గ్రీన్ పిచ్‌లను చూసిన టీమిండియా సీనియర్లు, విండీస్‌పై ఇలా ఆడడంలో అంతరార్థం డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత బాగా హర్ట్ అయిన ఫ్యాన్స్‌కి, విమర్శలకు ఏదో నిరూపించుకోవాలని చూడడమే.. 

Read more Photos on
click me!

Recommended Stories