IPL 2024: దానికోస‌మే హార్దిక్ పాండ్యా గుజ‌రాత్ కు గుడ్ బై చెప్పాడా? క్రికెట్ వ‌ర్గాల్లో మ‌రో ర‌చ్చ‌..

First Published Nov 27, 2023, 4:44 PM IST

Hardik Pandya: హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియ‌న్స్ డ్రాప్ చేయడంతో గుజరాత్ జట్టు అతనికి అవకాశం ఇచ్చి కెప్టెన్‌గా చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న హార్దిక్ పాండ్యా తొలి సీజన్‌లో ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. అలాగే, భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా అవకాశం కూడా లభించింది.

Hardik Pandya returns to MI: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజ‌న్ కోసం నిర్వహించే ఆటగాళ్ల‌ వేలానికి ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కీల‌క ఆట‌గాళ్ల‌ను ప‌లు జ‌ట్ల యాజ‌మాన్యాలు వ‌దులుకోవ‌డంపై కొత్త చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా గురించి క్రికెట్ వ‌ర్గాల్లో ర‌చ్చ మొద‌లైంది. 
 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. త‌న కోరిక‌మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని గుజ‌రాత్ జ‌ట్టు ప్ర‌క‌టించ‌డంపై హార్దిక్ పాండ్యా చేసింది కరెక్టా?  కాదా?  అనే చ‌ర్చ మొదలైంది.

అలాగే, డ‌బ్బువిష‌యంలోనే హార్దిక్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా అనే దానిపై ఇప్పుడు అనేక చర్చలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 

ఎందుకంటే, ఒక స‌మ‌యంలో ముంబై యాజ‌మాన్యం హార్దిక్ పాండ్యాను తప్పించడంతో గుజరాత్ జట్టు అతనికి అవకాశం ఇచ్చి కెప్టెన్ గా చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న హార్దిక్ పాండ్యా తొలి సీజన్లో టైటిల్ గెలిచాడు. భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా కూడా అవకాశం దక్కింది. హార్దిక్ హఠాత్తుగా గుజరాత్ ను వదిలేసి ముంబైకి వెళ్లడం పలువురు అభిమానులను షాక్ కు గురిచేసింది.

ఈ ఘటనపై స్పందించిన ఆకాశ్ చోప్రా పరోక్షంగా హార్దిక్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. 'జీవితంలో ఒక్కసారైనా అవకాశం వస్తుంది. అది డబ్బునా, సంప్రదాయమా అని తేల్చుకునే పరిస్థితిలోకి నెట్టివేయబడతారు. మీరు ఏది ఎంచుకున్నా మీ జీవితాన్ని నువ్వెవరో వర్ణిస్తుంది' అని పేర్కొన్నారు.

గుజరాత్ కు టైటిల్ గెలిచిన తర్వాత హార్దిక్ కొత్త సంప్రదాయాన్ని సృష్టిస్తున్న సమయంలో ఆకాశ్ చోప్రా పరోక్షంగా హార్దిక్ ను విమర్శించాడు. అయితే ఆర్సీబీ జట్టు పట్ల తనకున్న విధేయత కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.
 

గుజ‌రాత్ హార్ధిక్ ను వ‌దులుకోవ‌డం వెనుక క్రీడా వ‌ర్గాలు విభిన్న‌మైన టాక్ న‌డుస్తోంది. పాండ్యా తన ఫీజ్ పెంచాలని గుజరాత్ యాజమాన్యాన్ని కోరడం, ప్రత్యేకంగా బ్రాండింగ్ అవకాశాలు కావాల‌ని ప‌ట్టుబ‌డ‌టం మ‌ధ్య నెల‌కొన్న విభేదాలే కార‌ణ‌మ‌ని ప‌లు మీడియా కథ‌నాలు పేర్కొంటున్నాయి. 
 

click me!