ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ... వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి...

Published : Feb 15, 2022, 02:50 PM IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. విరాట్‌తో పాటు నయా సారథి రోహిత్ శర్మ కూడా (మొదటి వన్డేలో హాఫ్ సెంచరీ మినహా) పెద్దగా బ్యాటింగ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

PREV
111
ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ... వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి...

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకి దూరం కావడంతో రోహిత్ శర్మ ఎవరితో ఓపెనింగ్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది...

211

ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి కొన్ని మ్యాచుల్లో ఓపెనింగ్ చేశాడు రోహిత్ శర్మ. అలాగే మంచి ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ కూడా టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు...

311

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన తర్వాత భారత జట్టు తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన రుతురాజ్ గైక్వాడ్, విండీస్‌తో సిరీస్‌లో చోటు దక్కించుకోగలడా? అనేది అనుమానమే...

411

టీ20 సిరీస్‌కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత నయా సారథి రోహిత్ శర్మ్, ఓపెనింగ్ ప్లేస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

511

‘ఐపీఎల్‌ అనేది కేవలం రెండు నెలల పాటు సాగే క్రికెట్ లీగ్. మిగిలిన 10 నెలలు టీమిండియాకి ఆడాల్సి ఉంటుంది. ఐపీఎల్, టీమిండియాకి ఆడడం రెండూ ఒకటి కాదు..

611

ఐపీఎల్‌‌లో చేసినట్టుగా ఇషాన్ కిషన్‌తో ఓపెనింగ్ చేయాలనే ఆలోచన అయితే లేదు. ఓపెనర్‌గా ఎవరు వస్తారనేది ఇప్పుడే చెప్పలేను కూడా...

711

విరాట్ కోహ్లీ ఫామ్‌ గురించి ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదు. అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, టీమిండియాకి చాలా కీలకమైన ఆటగాడు..

811

విరాట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. కోహ్లీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవేమీ నిజం కాదు...

911

టీమిండియా ప్రతీ విషయం గురించి ఎంతో కేర్ తీసుకుంటుంది. దాదాపు దశాబ్దానికి పైగా టీమిండియాలో ఉన్న ఆటగాడి గురించి ఇలాంటి వార్తలు రావడం షాకింగ్‌గా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...

1011

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీకి ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఓపెనింగ్ చేశారు...

1111

అవసరమైతే వరల్డ్ కప్‌లో కూడా ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కామెంట్ చేశాడు విరాట్. దీంతో ఈసారి విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తారా? అనేది తేలాల్సి ఉంది...
 

Read more Photos on
click me!

Recommended Stories