ఫామ్‌లో లేకపోతే సురేష్ రైనా ఆడించడం ఎందుకు... సీఎస్‌కే సీఈవో సంచలన వ్యాఖ్యలు...

Published : Feb 15, 2022, 12:35 PM IST

ఐపీఎల్ 2022 వేలంలో ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనాని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌, బేస్ ప్రైజ్‌కి కూడా రైనా కోసం ప్రయత్నించలేదు...

PREV
110
ఫామ్‌లో లేకపోతే సురేష్ రైనా ఆడించడం ఎందుకు... సీఎస్‌కే సీఈవో సంచలన వ్యాఖ్యలు...

ఐపీఎల్ కెరీర్‌లో 205 మ్యాచులు ఆడి 32.51 సగటుతో 5528 పరుగులు చేశాడు సురేష్ రైనా. ఇందులో ఓ సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

210

ఫీల్డర్‌గా 108 క్యాచులు అందుకున్న సురేష్ రైనా, 506 ఫోర్లు, 203 సిక్సర్లు బాదాడు. బౌలింగ్‌లో 25 వికెట్లు తీసి, జట్టుకి అవసరమైనప్పుడు ఆల్‌రౌండర్‌గానూ రాణించాడు...

310

‘తలా’ ఎమ్మెస్ ధోనీకి ఆప్త మిత్రుడిగా పేరొందిన‘చిన్నతలా’ సురేష్ రైనా, మాహీ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికీ తాను కూడా రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు...

410

మాహీ ఆడకపోతే తాను కూడా ఐపీఎల్ ఆడనని, చెన్నై సూపర్ కింగ్స్‌కి తప్ప మరో జట్టుకి ఆడలేనని సురేష్ రైనా చేసిన కామెంట్లు, అతని ఐపీఎల్ కెరీర్‌కి సరైన ముగింపు లేకుండా చేశాయి...

510

ఐపీఎల్ 2022 మెగా వేలంలో 25 ప్లేయర్లను కొనుగోలు చేసిన తర్వాత కూడా సీఎస్‌కే పర్సులో రూ. 2.6 కోట్లు ఉన్నాయి. రైనా బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు... 

610

చాలామంది బేస్ ప్రైజ్ ప్లేయర్లను ఆడించకుండా కేవలం ప్రాక్టీస్ సెషన్స్ కోసం వాడుతుంది సీఎస్‌కే. అలా ఓ బేస్ ప్రైజ్ ప్లేయర్ బదులు రైనాని కొనుగోలు చేసినా... సీఎస్‌కే పర్సులో ఇంకా రూ.80 లక్షలు మిగిలి ఉండేవి...

710

‘సురేష్ రైనా, సీఎస్‌కే జట్టులో ఎప్పటి నుంచి కీలక సభ్యుడు. ఈసారి అతను లేకపోవడం చాలా కష్టంగా ఉంది. మేం కాకపోయినా వేరే ఫ్రాంఛైజీలు అయినా రైనాని కొనుగోలు చేస్తాయని అనుకున్నాం...

810

టీమ్ కాంబినేషన్ దృష్టిలో పెట్టుకోవడం వల్లే రైనాని కొనుగోలు చేయలేదు. అతని సరైన ఫామ్‌లో లేడు. ఫామ్‌లో లేనప్పుడు ఏ ప్లేయర్‌ని అయినా పక్కన బెట్టక తప్పదు...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్...

910

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ కంటే సురేష్ రైనా తక్కువ మ్యాచుల్లో ఎక్కువ పరుగులు చేశాడు. అయినా కెప్టెన్ కావడం వల్ల మాహీకి రూ.12 కోట్లతో రిటైన్ చేసుకుంది సీఎస్‌కే...

1010

తన బ్యాటింగ్‌తో మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన సురేష్ రైనాని బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసి అయినా, ఓ ఫేర్‌వెల్ మ్యాచ్ ఇచ్చి గౌరవంగా సాగనంపాల్సిందని అంటున్నారు అతని అభిమానులు...

Read more Photos on
click me!

Recommended Stories