ఆ లైన్ దాటగానే భయమేసింది, ఎమ్మెస్ ధోనీ కంటే... దీపక్ చాహార్ కామెంట్స్...

Published : Feb 15, 2022, 01:40 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలంలో దీపక్ చాహార్‌ను ఏకంగా రూ.14 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. రూ.15.25 కోట్లకు ముంబై ఇండియన్స్‌ జట్టులోకి తిరిగి వెళ్లిన ఇషాన్ కిషన్ తర్వాత ఐపీఎల్ 2022 మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ దీపక్ చాహారే...

PREV
112
ఆ లైన్ దాటగానే భయమేసింది, ఎమ్మెస్ ధోనీ కంటే... దీపక్ చాహార్ కామెంట్స్...

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని మొదటి రిటెన్షన్‌గా రూ.16 కోట్లకు అట్టిపెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఎమ్మెస్ ధోనీని రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది...

212

రూ.14 కోట్లకు అమ్ముడుపోయిన దీపక్ చాహార్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే రెండు కోట్ల రూపాయలు అధికంగా తీసుకోబోతున్నాడు...

312

చెన్నై సూపర్ కింగ్స్ కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి 2016, 2017 సీజన్లలో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ జట్టుకి ఆడాడు దీపక్ చాహార్..

412

‘ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కూడా ఎలాంటి తేడా ఉండదనే అనుకుంటున్నా. ఎందుకంటే నేను తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ తరుపునే ఆడబోతున్నాను...

512

అక్కడ ఎమ్మెస్ ధోనీ, జడేజా, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో... ఇలా చాలామంది పాత ప్లేయర్లే ఉండబోతున్నారు. కాబట్టి నాలుగేళ్లుగా చూస్తున్న ముఖాలనే మళ్లీ చూడాలి...

612

పూణేలో కూడా దాదాపు వీళ్లే ఉన్నారు. అప్పుడు మాహీ భాయ్, శ్రీనివాసన్ సర్ నాకు 2018లో నిన్ను సీఎస్‌కేలోకి తీసుకుంటామని చెప్పారు. చెప్పినట్టే తీసుకున్నారు కూడా...

712

నేనెప్పుడూ ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పలేదు కానీ నేను క్రికెట్ ఆడడం మొదలెట్టినప్పటి నుంచే ఆల్‌రౌండర్‌గా మారాలని ప్రయత్నిస్తూ ఉన్నాను...

812

లీగ్ క్రికెట్‌లో నాకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ దొరుకుతోంది. 2018లో ఓసారి 48 పరుగులు చేశా. ఇకపై బ్యాటుతో కూడా అదరగొట్టగలనని నమ్ముతున్నాను...

912

ఐపీఎల్ 2022 మెగా వేలంలో నా ధర రూ.14 కోట్లు తాకగానే భయమేసింది. ఇంతకంటే ముందుకు వెళ్లకూడదని దేవుడిని ప్రార్థించాను. ఎందుకంటే నాపైన అంతకంటే ఎక్కువ ఖర్చు చేయడానికి సీఎస్‌కే సిద్ధంగా లేదని నాకు తెలుసు...

1012

వేరే టీమ్ తరుపున ఆడడాన్ని నేను ఊహించుకోలేను. ఎందుకంటే నన్ను ఎప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడిపిస్తానని శ్రీనివాసన్ సర్ ప్రామిస్ చేశారు..

1112

వేలం ముగిసిన తర్వాత మాహీ భాయ్ కంటే నీకు రూ.2 కోట్లు ఎక్కువ ఇస్తున్నారని చాలామంది అన్నారు. అది ఆయన తీసుకున్న నిర్ణయం. మొదటి రిటైన్‌గా ఉండమని మాహీని కోరారు...

1212

అయితే మాహీ భాయ్ కావాలని ఆ ప్లేస్ తీసుకోలేదు. కావాలంటే ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి మహీ భాయ్ సిద్ధంగా ఉంటారు...’ అంటూ కామెంట్ చేశాడు దీపక్ చాహార్..

Read more Photos on
click me!

Recommended Stories